Ntr Trivikram Movie: కొత్త జోనర్‌లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ - కన్ఫామ్ చేసిన ప్రొడ్యూసర్
Ntr Trivikram Movie: ఎన్టీఆర్ - ఢైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాపై ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా మూవీ జోనర్‌ను రివీల్ చేశాడు
Ntr Trivikram Movie: అరవింద సమేత వీర రాఘవ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ కాంబో మూవీపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. . ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పౌరాణిక కథాంశంతో ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
దర్శకుడిగా త్రివిక్రమ్ ఇప్పటివరకు అటెంప్ట్ చేయని జోనర్‌లో ఈ సినిమా ఉంటుందని నాగవంశీ తెలిపాడు. పాన్ వరల్డ్ లెవెల్‌లో ఎన్టీఆర్ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నట్లు చెప్పాడు.
ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తోన్న ప్రాజెక్ట్‌లతో పాటు మహేష్‌బాబు - త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తర్వతే ఈ మైథలాజికల్ మూవీని ప్రారంభిస్తామని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీపై నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. పౌరాణిక కథాంశంతో రూపొందిన రామాయణం సినిమాతో బాల నటుడిగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ హీరోగా మారిన తర్వాత ఈ జోనర్‌లో సినిమా చేయలేదు.
మరోవైపు త్రివిక్రమ్ కూడా పౌరాణికాల జోలికి ఇప్పటివరకు వెళ్లలేదు. ఇద్దరు ఒకేసారి ఈ జోనర్‌లో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. తన నెక్స్ట్ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఫిబ్రవరి 24న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు.
మార్చి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ ఏప్రిల్‌లో మొదలుకానున్నట్లు సమాచారం.