Ram Charan on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ అంటే భయం వేసింది కానీ.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-ram charan on jr ntr says professional rivalry never came into the picture between them ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan On Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ అంటే భయం వేసింది కానీ.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ అంటే భయం వేసింది కానీ.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Feb 09, 2023 01:16 PM IST

Ram Charan on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ అంటే భయం వేసింది అంటూ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి స్పందిస్తూ.. స్క్రీన్ పై పోటీ ఉన్నా.. బయట మాత్రం మంచి రిలేషన్‌షిప్ ఉందని చెప్పాడు.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్

Ram Charan on Jr NTR: ఆర్ఆర్ఆర్ అనే మూవీ తీయడం, అందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలను పెట్టడం రాజమౌళి చేసిన సాహసమే అని చెప్పాలి. ఎంతో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న ఈ ఇద్దరు సమకాలీన హీరోలు, వారి కుటుంబాల మధ్య సినిమా ఇండస్ట్రీలో ఉన్న పోటీ గురించి అందరికీ తెలుసు. అలాంటి హీరోలను పెట్టి సినిమా తీయాలన్న ఆలోచనే ఓ డైరెక్టర్ కు భయం కలిగిస్తుంది.

కానీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో ఇటు రామ్ చరణ్, అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సమానంగా సంతృప్తి పరిచాడనే చెప్పాలి. అయితే తారక్ తో స్క్రీన్ పై ఉన్న పోటీ గురించి తాజాగా రామ్ చరణ్ స్పందించాడు. అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెర్రీ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జూనియర్ తో పోటీపై చరణ్ స్పందించాడు. తమ నిజ జీవితాల్లో ఉన్న పోటీని స్క్రీన్ పై చూపించాలనే రాజమౌళి అనుకున్నాడా అని ప్రశ్రకు స్పందిస్తూ చెర్రీ ఆసక్తికర సమాధానమిచ్చాడు.

"ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నాను. బహుశా కావచ్చు. ఎందుకు కాకూడదు? అలా ఆలోచించకపోవడానికి కారణమేమీ లేదు. కానీ రాజమౌళి మాత్రం స్క్రీన్ పై మేము ప్రత్యర్థులుగా లేని సమయంలో మా నిజ జీవితాల్లో ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని చాలా బాగా చూపించారు.

సినిమాలో ఎవరు బాగా చేస్తారు అనే అంశంపై నాకు ఎప్పుడూ ఓ భయం ఉండేది. కానీ వృత్తిపరమైన పోటీ ఎప్పుడూ మా మధ్య రాలేదు. మేము చాలా సౌకర్యంగా నటించాం. అద్భుతంగా రాసిన మా స్టోరీలు, క్యారెక్టర్లు ఎవరికి వారు సౌకర్యంగా నటించేలా చేశాయి. ఇక్కడ ఎవరు పైచేయి సాధించారు అన్నది ఉండదు.

ఇక్కడంతా స్టోరీ, రాజమౌళి విజనే కనిపిస్తుంది. రాజమౌళి కోసం కాకపోయి ఉంటే మేము ఈ సినిమాను ఇంత సౌకర్యవంతంగా చేసి ఉండేవాళ్లం కాదేమో. ప్రతిదాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అతనికి బాగా తెలుసు. ఫిల్మ్ మేకింగ్ విషయంలోనే కాదు ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో కూడా. అందుకే మా మధ్య పోటీ అన్నది ఎప్పుడూ రాలేదు" అని రామ్ చరణ్ స్పష్టం చేశాడు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ చాయిస్ లాంటి అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్స్ కోసం నాటు నాటు సాంగ్ పోటీ పడుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం