Telugu News  /  Entertainment  /  Mahesh Rajamouli Movie To Be Launched In June Says A Report
రాజమౌళి, మహేష్ బాబు
రాజమౌళి, మహేష్ బాబు

Mahesh Rajamouli Movie: మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడే!

06 February 2023, 17:35 ISTHari Prasad S
06 February 2023, 17:35 IST

Mahesh Rajamouli Movie: మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నదానిపై కీలకమైన అప్‌డేట్ వచ్చింది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఎస్ఎస్ఎంబీ29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Mahesh Rajamouli Movie: టాలీవుడ్ లో ఇలాంటి క్రేజీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా తీయబోతున్నారన్న వార్త బయటకు రాగానే దీనిపై ఎంతో బజ్ క్రియేట్ అయింది. ఈ ఇద్దరి మూవీ అంటే పాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ లెవల్. అందుకే అలాంటి స్టోరీయే ఎస్ఎస్ఎంబీ29 కోసం సిద్ధమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మూవీకి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే స్టోరీ అందిస్తున్నాడు. ఇది ఆఫ్రికాలో జరిగే ఓ యాక్షన్ అడ్వెంచర్ అని, వివిధ దేశాల్లో షూటింగ్ జరుపుతారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పై కీలకమైన అప్‌డేట్ వచ్చింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఎస్ఎస్ఎంబీ29 మూవీని ఈ ఏడాది జూన్ లో లాంచ్ చేయనున్నారు.

ఈ మూవీ స్క్రిప్ట్ త్వరలోనే పూర్తి కానుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడంలో బిజీగా ఉన్న రాజమౌళి ఆ తర్వాత ఈ సినిమాపై పూర్తిగా దృష్టిసారించనున్నాడు. ఇటు మహేష్ కూడా త్రివిక్రమ్ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ తర్వాతే మహేష్.. రాజమౌళితో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. గతేడాది కృష్ణ మరణంతో చాలా ఆలస్యమైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.81 కోట్లకు దక్కించుకుంది. అటు సినిమా నైజాం హక్కులను దిల్ రాజు రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్, రాజమౌళి మూవీ విషయానికి వస్తే ఈ భారీ బడ్జెట్ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కింద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరు అన్నది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.