SSMB28 OTT Rights: సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందొతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ ప్రేమికుల్లో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో ఎక్కువ మంది ఆత్రుతగా చూస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా ఆసక్తికరంగా మారింది. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నాన్ థియెట్రికల్ హక్కులను హాట్ కేకు వలే అమ్ముడుపోయినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.,ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మహేష్-త్రివిక్రమ్ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్ విడుదల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం వెచ్చించినట్లు సమాచారం. దాదాపు రూ.80 కోట్లకు ఈ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.,అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారీ ధరకు SSMB28 మూవీ అమ్ముడుపోయిందే నిజమైతే టాలీవుడ్ ఓటీటీ స్పేస్‌లో అత్యంథ ధర పలికిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా నిలుస్తుంది.,మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.,