Buttabomma Movie Result: బుట్టబొమ్మ ఫెయిలవుతుందని త్రివిక్రమ్ ముందే చెప్పాడు - రిజల్ట్‌పై ప్రొడ్యూసర్ కామెంట్స్
Buttabomma Movie Result: బుట్టబొమ్మ సినిమా ఫెయిలవుతుందని త్రివిక్రమ్ ముందే చెప్పారని అన్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ సినిమా రిజల్ట్‌పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Buttabomma Movie Result: ఫిబ్రవరి 4న రిలీజైన బుట్టబొమ్మ సినిమా రిజల్ట్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా ఫెయిలవుతుందని త్రివిక్రమ్ ముందే చెప్పాడని అన్నాడు. మలయాళంలో విజయవంతమైన కప్పేలా ఆధారంగా బుట్టబొమ్మ సినిమా తెరకెక్కింది. కోలీవుడ్ నటుడు అర్జున్‌దాస్‌తో పాటు అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిన్న సినిమా డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్నది. మినిమం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఫెయిలవ్వడానికి గల కారణాలపై నాగవంశీ ఇంట్రెస్టింగ్స్ కామెంట్స్ చేశారు.
రిలీజ్‌కు ముందే ఈ సినిమాను త్రివిక్రమ్‌కు చూపించానని అన్నాడు. సినిమా ఫెయిలవుతుందని ఆయన ముందే ఊహించారని అనుకున్నట్లుగానే రిజల్ట్ వచ్చిందని అన్నాడు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకోకుండా ఓన్‌గా బుట్టబొమ్మ సినిమాను రిలీజ్ చేశామని పేర్కొన్నాడు. నష్టాన్ని తామే భరించామని తెలిపాడు.
2020లో మలయాళ సినిమా కప్పేలా రిలీజైందని, మూడేళ్లలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోవడంతోనే సినిమా పరాజయం పాలవ్వడానికి కారణంగా భావిస్తోన్నట్లు నాగవంశీ పేర్కొన్నాడు. బుట్టబొమ్మ సినిమా పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది.