తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nitin Rashmika Movie: ఆ ముగ్గురూ మళ్లీ కలిశారు.. నితిన్, రష్మిక మూవీ అనౌన్స్‌మెంట్

Nitin Rashmika Movie: ఆ ముగ్గురూ మళ్లీ కలిశారు.. నితిన్, రష్మిక మూవీ అనౌన్స్‌మెంట్

Hari Prasad S HT Telugu

22 March 2023, 18:35 IST

  • Nitin Rashmika Movie: ఆ ముగ్గురూ మళ్లీ కలిశారు.. నితిన్, రష్మిక మూవీ అనౌన్స్‌మెంట్ ఉగాది అయిన బుధవారం (మార్చి 22) జరిగింది. ఈ ఇద్దరూ మరోసారి వెంకీ కుడుముల డైరెక్షన్ లో నటించబోతున్నారు.

రష్మికా మందన్నా, నితిన్
రష్మికా మందన్నా, నితిన్

రష్మికా మందన్నా, నితిన్

Nitin Rashmika Movie: టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ కలిస్తే సినిమా హిట్టే అని ఫ్యాన్స్ ఫిక్సయిపోతారు. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ లోనే ఓ సినిమా రాబోతోంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల మరోసారి చేతులు కలిపారు. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

చలో మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన వెంకీ కుడుముల.. భీష్మతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడా మూవీలోని లీడ్ రోల్స్ అయిన నితిన్, రష్మికతోనే మరో సినిమా చేయబోతున్నాడు. ఉగాది రోజు అయిన బుధవారం (మార్చి 22) ఈ మూవీ అనౌన్స్‌మెంట్ జరగడం విశేషం. అంతేకాదు ఓ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నితిన్, రష్మిక మధ్య ఓ ఫన్నీ సంభాషణ జరుగుతుంది.

ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం లేదు.. మా మనోభావాలు మేము దెబ్బ తీసుకుంటున్నాం.. ధన్యవాదాలు అనే నితిన్ వాయిస్ తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన నితిన్ సేమ్ హీరోయినా అని అడుగుతాడు. ఆలోపే అవును సేమ్ హీరోయినే అంటూ రష్మిక సీన్ లోకి వస్తుంది. ఎప్పుడో వచ్చావ్.. ఇంతసేపు ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. ముంబై, ఢిల్లీ ఫ్యాన్స్ తో మాట్లాడాను.. తర్వాత హైదరాబాద్, బెంగళూరు అని చెప్పబోతుంది.

ఈలోపు ఆమెను అడ్డుకునే నితిన్.. నేషనల్ క్రష్ వి కదా ఆ మాత్రం ఉండాల్సిందే అంటాడు. ఇక లైవేనా లేక కాంట్రవర్సీలేమైనా అంటూ నితిన్ మొదలుపెట్టబోతే.. మధ్యలో జోక్యం చేసుకున్న రష్మిక.. తాను ఒక్క మాట మాట్లాడితే రెండు, మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయంటూ బాధపడుతుంది. ఈ లోపు నితిన్ అందుకుంటూ.. అదే నయం.. నేను ఒక్క హిట్ కొడితే.. రెండు, మూడు ఫ్లాపులు వస్తున్నాయంటూ నిట్టూరుస్తాడు.

మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం కదా.. హిట్టేలే అని రష్మిక అంటుంది. వీళ్లిద్దరి మాటలు ఇలా నడుస్తుండగానే.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సీన్ లోకి వస్తాడు. తానే ఈ మూవీలో హీరో అంటూ అతడు వస్తాడు. చివరిగా డైరెక్టర్ వెంకీ కుడుముల వచ్చి సినిమా గురించి ఓ చిన్న హింట్ ఇస్తాడు. టైటిల్ మాత్రం సస్పెన్స్ లో పెట్టేస్తాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.