Nithiin - Venky Kudumula Movie: మ‌రోసారి భీష్మ కాంబినేష‌న్ - వెంకీ కుడుముల‌తో నితిన్ సినిమా-nithiin to team up director venky kudumula once again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithiin - Venky Kudumula Movie: మ‌రోసారి భీష్మ కాంబినేష‌న్ - వెంకీ కుడుముల‌తో నితిన్ సినిమా

Nithiin - Venky Kudumula Movie: మ‌రోసారి భీష్మ కాంబినేష‌న్ - వెంకీ కుడుముల‌తో నితిన్ సినిమా

HT Telugu Desk HT Telugu
Nov 06, 2022 10:18 AM IST

Nithiin - Venky Kudumula Movie: భీష్మ త‌ర్వాత మ‌రోసారి ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

నితిన్
నితిన్

Nithiin - Venky Kudumula Movie: భీష్మ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు తెలిసింది. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో నితిన్ రెండోసారి ప‌నిచేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భీష్మ చిత్రం స‌క్సెస్‌గా నిలిచింది. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌కు క‌మ‌ర్షియ‌ల్‌ బ్రేక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా 40 కోట్ల‌కుపైగా కలెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

వెంకీ కుడుముల సోష‌ల్ మెసేజ్‌ను కామెడీతో చ‌క్క‌గా ఆవిష్క‌రించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. వెంకీ కుడుముల‌తో మ‌రో సినిమా త‌ప్ప‌కుండా చేస్తాన‌ని భీష్మ ప్ర‌మోష‌న్స్‌లోనే నితిన్ చెప్పాడు. తాజాగా ఆ మాట‌ను నిల‌బెట్టుకున్న‌ట్లు స‌మాచారం. అత‌డితో మ‌రో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వెంకీ కుడుముల చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో నితిన్ ఈ సినిమాను అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. భీష్మ స‌క్సెస్ త‌ర్వాత చిరంజీవితో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు వెంకీ కుడుముల‌. ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. స‌రైన క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్‌డేట్ రాలేదు. చిరంజీవి కూడా భోళాశంక‌ర్‌, వాల్తేర్ వీర‌య్య సినిమాల గురించి ప‌లు ప్ర‌మోష‌న్స్‌లో మాట్లాడారు. కానీ వెంకీ కుడుముల సినిమా గురించి ఎప్పుడూ ప్ర‌స్తావించ‌లేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌లు నిజ‌మేన‌ని తెలుస్తోంది. కాగా ప్ర‌స్తుతం నితిన్ ర‌చ‌యిత వ‌క్కంతం వంశీతో ఓ సినిమా చేయ‌బోతున్నారు. స్వీయ‌నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది.

IPL_Entry_Point