Mahesh Babu Rajamouli Movie Budget: మహేష్, రాజమౌళి మూవీ బడ్జెట్ రివీల్ - టాలీవుడ్‌లో బిగ్ బడ్జెట్ మూవీ ఇదే
Mahesh Babu Rajamouli Movie Budget: ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌బాబుతో అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు అగ్ర దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్‌లో బిగ్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ ఎంతంటే...

Mahesh Babu Rajamouli Movie Budget: ఆర్ఆర్ఆర్ తో (RRR) ఇంటర్‌నేషనల్ డైరెక్టర్‌గా మారిపోయాడు రాజమౌళి. ఈ సినిమాతో జేమ్స్ కామెరూన్‌తో పాటు ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్స్ రాజమౌళికి ఫ్యాన్స్‌గా మారిపోయారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను గెలుచుకొని తెలుగు సినిమా క్రేజ్‌ను విశ్వవ్యాప్తం చేసింది. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది.
అడ్వెంచరస్ థ్రిల్లర్…
ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌బాబుతో(Mahesh Babu) సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలిసారి రూపొందుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. తన గత సినిమాలకు భిన్నంగా అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ అయిన ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎనిమిది వందల కోట్లు…
కాగా మహేష్, రాజమౌళి మూవీ బడ్జెట్‌కు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్ తర్వాత వరల్డ్ వైడ్‌గా రాజమౌళి సినిమాలకు క్రేజ్ ఏర్పడటంతో పాన్ వరల్డ్ మూవీగా మహేష్ సినిమాను రాజమౌళి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాణంలో రాజమౌళి భాగస్వామిగా వ్యవహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫారిన్ యాక్టర్స్…
ఇందులో వివిధ భాషలకు చెందిన ఇండియన్ టాప్ యాక్టర్స్‌తో పాటు విదేశీ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమా కోసం అమెరికాకు చెందిన క్యాస్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.
ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు మహేష్‌బాబు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.