తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mumbaikar Ott Release Date: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి హిందీ మూవీ

Mumbaikar OTT Release Date: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి హిందీ మూవీ

Hari Prasad S HT Telugu

25 May 2023, 15:32 IST

    • Mumbaikar OTT Release Date: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ మూవీ. ఈ సినిమా పేరు ముంబైకర్. ఈ మూవీ జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ముంబైకర్ మూవీలో విజయ్ సేతుపతి
ముంబైకర్ మూవీలో విజయ్ సేతుపతి

ముంబైకర్ మూవీలో విజయ్ సేతుపతి

Mumbaikar OTT Release Date: విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ మూవీ ముంబైకర్. విలక్షణ నటుడిగా పేరుగాంచిన అతడు.. తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. నిజానికి చాలా నెలలుగా ఈ మూవీ రిలీజ్ పెండింగ్ లో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

చివరికి ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించడం విశేషం. ముంబైకర్ మూవీ జూన్ 2న జియోసినిమాలోకి రాబోతోంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఓ టీజర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి ఓ గ్యాంగ్‌స్టర్ గా కనిపిస్తున్నాడు. ఓ చిన్నారిని అతడు కిడ్నాప్ చేయడం ఇందులో చూడొచ్చు.

ఆ పిల్లాడు ముంబైలో ఓ డాన్ కొడుకే కావడం ఇక్కడ ట్విస్ట్. టీజర్ మొత్తం ఆ కిడ్నాప్ చుట్టే తిరిగింది. ఇందులో విజయ్ సేతుపతి హిందీ మాట్లాడే తీరు నవ్వు తెప్పిస్తుంది. ఇంతకుముందే ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో విజయ్ సేతుపతి హిందీ మార్కెట్ లో అడుగుపెట్టాడు. ఆ సిరీస్ కు మంచి రెస్పాన్స్ రావడంతోపాటు విజయ్ నటనకు కూడా పాజిటివ్ మార్కులు పడ్డాయి.

ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ సంతోష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ ముంబైకర్ మూవీలో విజయ్ సేతుపతితోపాటు విక్రాంత్ మస్సీ, తాన్యా మాణిక్‌తలా, రాఘవ్ బిర్నానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ అందించడం విశేషం. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.