Vijay Sethupathi Web Series: నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే
Vijay Sethupathi Web Series: ఫర్జీ తర్వాత మరో వెబ్‌సిరీస్‌కు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ భాషలో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు నేషనల్ అవార్డ్ విన్నర్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ దర్శకుడు ఎవరంటే...
Vijay Sethupathi Web Series: ఫర్జీ సిరీస్‌తో ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి. రాజ్ డీకే దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్‌లో నిజాయితీపరుడైన టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతి నటనకు విమర్శలు దక్కాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ సిరీస్‌తోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. తాజాగా అతడు మరో వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ సారి తమిళంలో చేయబోతున్నాడు.
ఈ వెబ్‌సిరీస్‌కు నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించబోతున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. శనివారం ఈ సిరీస్ ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఫొటోలను విజయ్ సేతుపతి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మణికందన్ దర్శకత్వంలో తొలి తమిళ వెబ్‌సిరీస్ చేయడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు.
శనివారం నుంచి ఈ సిరీస్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం. కాగా ఈ తమిళ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. గతంలో మణికందన్ దర్శకత్వంలో ఆనందవాన్ కట్టాలై, కడాసి వ్వసాయి అనే సినిమాలు చేశాడు విజయ్ సేతుపతి. మూడోసారి వీరిద్దరి కాంబోలో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోండటం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ధనుష్ దర్శకత్వంలో రూపొందిన కాకముట్టై సినిమాకుగాను నేషనల్ అవార్డును అందుకున్నాడు మణికందన్.