OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీ సందడి - 18 సినిమాలు, సిరీస్‌లు రిలీజ్
OTT Releases This Week: ఈ వారం విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే...
ఆహా ఓటీటీ (Aha OTT)
సత్తిగాని రెండెకరాలు
పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ భండారి ప్రధాన పాత్రలో నటించిన సత్తిగాని రెండెకరాలు మూవీ ఆహా ఓటీటీలో మే 26న రిలీజ్ కానుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అభివన్ దర్శకత్వం వహించాడు. వెన్నెలకిషోర్ కీలక పాత్రను పోషిస్తోన్న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సత్తిగాని రెండెకరాలు మూవీని నిర్మించింది.
ట్రెండింగ్ వార్తలు
జియో సినిమా ఓటీటీ (Jio Cinema)
బూ
రకుల్‌ప్రీత్‌సింగ్, విశ్వక్‌సేన్, నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న బూ మూవీ జియో సినిమా ఓటీటీలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హారర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. హాలోవీన్ బుక్ ఓపెన్ చేయడంతో ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనూహ్య సంఘటనలతో ఈ మూవీ రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో బూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
భేడియా (హిందీ మూవీ)
చిత్రకూట్
క్రాక్ డౌన్ సీజన్ 2
జీ5 ఓటీటీ (Zee5 OTT)
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్
సల్మాన్‌ఖాన్, పూజాహెగ్డే జంటగా నటించిన బాలీవుడ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ హీరో వెంకటేష్ కీలక పాత్రను పోషించారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
సిర్ఫ్ ఏక్ బందాకాఫీహై
విడుదల (తెలుగు)
సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన విడుదల మూవీ ఈ వీక్‌లోనే జీ5 ఓటీటీలో రిలీజైంది. విడుదల సినిమా తెలుగు, తమిళ భాషల్లో విమర్శకుల ప్రశంసలను అందుకొంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఫ్యూబర్
టీనా అండ్ టీనా మూవీ (స్పానిష్)
మదర్స్ డే (పోలాండ్ మూవీ)
వేర్ ది ట్రాక్ ఎండ్స్ (స్పానిష్ మూవీ)
ఫ్యూబర్ (ఇంగ్లీష్ మూవీ )
హార్డ్ ఫీలింగ్స్
బ్లడ్ అండ్ గోల్డ్
టర్న్ ఆఫ్ ది టైడ్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
జాన్ విక్ 4 (రెంటల్)
పొన్నియన్ సెల్వన్ 2