War 2 Release Date: ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
War 2 Release Date: వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటే...
War 2 Release Date: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాను 2025 జనవరి 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో వార్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలిసింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమాలో ఎన్టీఆర్ కంప్లీట్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్స్‌కు పూర్తి భిన్నంగా పవర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు చెబుతోన్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్, హృతిక్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా హృతిక్ రోషన్ అతడికి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారింది. యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ హృతిక్ రోషన్ ఈ ట్వీట్‌లో ఎన్టీఆర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు.
వార్ 2 మూవీ గురించే హృతిక్ ఈ కామెంట్ చేసినట్లు చెబుతోన్నారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ దాదాపు 50 కోట్లకుపైగా పారితోషికాన్ని స్వీకరిస్తోన్నట్లు సమాచారం.
దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీకి యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్నాడు.
కోస్టల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. కొరటాల శివ సినిమాతో పాటు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీని అంగీకరించాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.