తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keeravani On Oscars Tag: ఆస్కార్ ట్యాగ్ చూసి ఏడ్వాలో, సంతోషించాలో తెలియ‌డం లేదు - కీర‌వాణి సంచ‌ల‌న కామెంట్స్‌

Keeravani on Oscars Tag: ఆస్కార్ ట్యాగ్ చూసి ఏడ్వాలో, సంతోషించాలో తెలియ‌డం లేదు - కీర‌వాణి సంచ‌ల‌న కామెంట్స్‌

30 April 2023, 14:14 IST

google News
  • Keeravani on Oscars Tag: ఆస్కార్ ట్యాగ్ చూసి త‌మ సినిమాల‌కు మ్యూజిక్ అందించ‌మ‌ని కోరుతూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ద‌ర్శ‌కుల సంఖ్య ఎక్కువైపోయింద‌ని కీర‌వాణి అన్నాడు. మ్యూజిక్ ప‌రంగా నిజాయితీగా ప్ర‌యోగాలు చేసినా అర్థం చేసుకునే నాలెడ్జ్‌, క్రియేటివిటీ నేటి ద‌ర్శ‌కుల్లో లోపించింద‌ని పేర్కొన్నాడు.

కీర‌వాణి
కీర‌వాణి

కీర‌వాణి

Keeravani on Oscars Tag: ఆస్కార్ ట్యాగ్ చూసి సంతోష‌ప‌డాలో ఏడ్వాలో తెలియ‌డం లేద‌ని సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి అన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కుగాను బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో లిరిసిస్ట్ చంద్ర‌బోస్‌తో క‌లిసి కీర‌వాణి ఆస్కార్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకొన్నారు. ఆస్కార్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న తొలి తెలుగు సంగీత ద‌ర్శ‌కుడిగా చ‌రిత్ర‌ను సృష్టించాడు.

ఆస్కార్ సాధించ‌డం వెనుక ఉన్న కృషితో పాటు త‌న కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఇటీవ‌ల రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో కీర‌వాణి పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌పై ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఒకానొక‌ స‌మ‌యంలో తాను సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాల‌ని అనుకున్నాన‌ని కీర‌వాణి అన్నాడు. ఆ స‌మ‌యంలో చాలా మంది ద‌ర్శ‌కుల‌పై కోపంతో నేను అంద‌రిని తిట్టాన‌ని చెప్పాడు.

ట్విట్ట‌ర్‌లో నేను చేసిన కామెంట్స్ చూసి చాలా హార్ట్ అయ్యార‌ని పేర్కొన్నాడు. నా టాలెంట్‌, మెరిట్ మీద న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడే న‌న్ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకోవాలి. నా క్రియేష‌న్‌ను అప్రీషియేట్ చేయాలి. నేను ఇచ్చింది అర్థం చేసుకుంటూ దానిని స్క్రీన్‌పై పిక్చ‌రైజ్ చేయాలి. అలా కాకుండా ఇది ఇలా చేయండి. అది ఇలా ఉండాలి, అలా ఉండాలి... అంటూ పాఠాలు చెప్పే ద‌ర్శ‌కులు ఎక్కువైపోయారు. లెక్చ‌ర్స్ ఇచ్చే ద‌ర్శ‌కుల‌కు నాలెడ్జ్ ఉండ‌దు.

రిఫ‌రెన్స్ పాయింట్ చెబితే త‌ప్ప క‌మ్యూనికేట్ చేయ‌డం వారికి రాదు. అలానాటి ద‌ర్శ‌కుల్లా హిందోళం, హంస‌న‌ది వంటి రాగాలు నేటి వారికి తెలియ‌డం లేదు. నిజాయితీగా ఏదైనా ప్ర‌యోగం చేసినా అర్థం చేసుకోలేక‌పోతున్నారు. వారికి నా టాలెంట్‌ను చూపించుకోవ‌డానికే ఆస్కార్ ట్యాగ్ కావాల్సివ‌చ్చింది. అయితే ఆస్కార్ వ‌చ్చినందుకు సంతోషించాలో ఏడ్వాలో తెలియని ప‌రిస్థితి. ఆ ట్యాగ్ చూసి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాళ్ల‌కు ఏం తెలియ‌దు.

ఆస్కార్ వ‌చ్చింది కాబ‌ట్టే నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. ఆ ట్యాగ్ చూడ‌కుండా నా ట్యూన్స్ అర్థం చేసుకునే ద‌ర్శ‌కులు వ‌స్తేనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కొత్త ట్యూన్స్ ఇచ్చే ఎగ్జైట్‌మెంట్ నాలో వ‌స్తుంది అని కీర‌వాణి పేర్కొన్నాడు. ఏ ట్యాగ్స్ చూడ‌కుండా న‌న్ను న‌న్నుగా స్వీక‌రిస్తూ నేను ఇచ్చే మ్యూజిక్ న‌చ్చే ద‌ర్శ‌కుల కోసం ఎదురుచూస్తున్నాన‌ని అన్నాడు. కీర‌వాణి కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

తదుపరి వ్యాసం