Rajamouli Tweet On Keeravani: కొంచెం గ్యాప్ ఇవ్వ‌మ్మా - కీర‌వాణిపై రాజ‌మౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్‌-rajamouli interesting tweet on keeravani viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajamouli Interesting Tweet On Keeravani Viral On Social Media

Rajamouli Tweet On Keeravani: కొంచెం గ్యాప్ ఇవ్వ‌మ్మా - కీర‌వాణిపై రాజ‌మౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 26, 2023 09:46 AM IST

Rajamouli Tweet On Keeravani: బుధ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణికి ప‌ద్మ‌శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది. కీర‌వాణికి ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించ‌డంపై రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. అత‌డి ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రాజమౌళి, కీరవాణి
రాజమౌళి, కీరవాణి

Rajamouli Tweet On Keeravani: సినీ సంగీతానికి చేసిన అస‌మాన సేవ‌ల‌కు గాను సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణికి బుధ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ సినిమాలో కీర‌వాణి సంగీతాన్ని అందించిన నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఆ సంతోషం మ‌రువ‌క ముందే కీర‌వాణికి కేంద్రం ప‌ద్మ‌శ్రీ అవార్డును అనౌన్స్ చేసింది.

ఈ అవార్డుతో కీర‌వాణి ఫ్యామిలీలో సంబ‌రాలు రెట్టింపు అయ్యాయి. సోద‌రుడికి ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. కొంచెం గ్యాప్ ఇవ్వ‌మ్మా ఒక‌టి పూర్తిగా ఎంజాయ్ చేశాకా మ‌రొటి ఇవ్వు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ అవార్డు ఎప్పుడో నీకు ఎప్పుడో ద‌క్కాల్సింద‌ని అభిమానులు అంటున్నారు. ఈ విశ్వం మ‌న క‌ష్టానికి స‌రైన స‌మ‌యంలోనే ప్ర‌తిఫలం ఇస్తుంద‌ని నువ్వు చెబుతున్నావు. కానీ ఈ విశ్వానికి మాత్రం నేను చెప్ప‌ది ఒక్క‌టే కొంచెం గ్యాప్ ఇవ్వ‌మ్మా ఒక‌టి పూర్తిగా ఎంజాయ్ చేశాకా మ‌రొక‌టి ఇవ్వు అంటూ రాజ‌మౌళి ట్వీట్ చేశాడు. మా పెద్ద‌న్న ఎమ్ ఎమ్ కీర‌వాణికి ప‌ద్మ‌శ్రీ అవార్డు రావ‌డం గ‌ర్వంగా ఉంది అంటూ ఈ ట్వీట్‌లో రాజ‌మౌళి పేర్కొన్నాడు.

రాజ‌మౌళి చేసిన ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌ల అనౌన్స్ చేసిన ఆస్కార్ నామినేష‌న్స్‌లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటు తుది జాబితాలో స్థానాన్ని ద‌క్కించుకున్న‌ది.

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. మార్చి 25న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

IPL_Entry_Point