తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  8am Metro Ott: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

04 May 2024, 14:36 IST

google News
    • 8 AM Metro OTT Release Date: 8ఏఎం మెట్రో సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. థియేటర్లలో రిలీజైన సుమారు ఏడాది తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

8 A.M. Metro Movie OTT: ‘మల్లేశం’ సినిమాతో దర్శకుడు రాజ్ రాచకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం ప్రశంసలను దక్కించుకుంది. ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితంపై రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఆ చిత్రం హిట్ అయింది. బాలీవుడ్‍లో రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన '8ఏఎం మెట్రో' సినిమా గతేడాది విడుదలైంది. విమర్శకుల నుంచి ప్రశంసలను దక్కించుకుంది. ఇప్పుడు ఈ 8ఏఎం మెట్రో సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

8ఏఎం మెట్రో సినిమా మే 10వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై ఆ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. తమ ప్లాట్‍ఫామ్‍పై ఈ మూవీని ఉచితంగా చూడొచ్చని పేర్కొంది. మే 10 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా జీ5లో ప్రీమియర్ కానుంది.

ఏడాది తర్వాత..

గుల్షన్ దేవయా, సాయామీ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించిన 8ఏఎం మెట్రో సినిమా 2023 మే 19న థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ థియేటర్లలో విడుదలైంది. అయితే, విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి. పాజిటివ్ టాక్ వచ్చింది. థియేటర్లలో రిలీజైన సంవత్సరం తర్వాత ఇప్పుడు 8ఏఎం మెట్రో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 10న జీ5లో అడుగుపెడుతోంది.

8ఏఎం మెట్రో సినిమాను ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు రాజ్ రాచకొండ. ప్రముఖ కవి గుల్జర్ రాసిన కొన్ని పద్యాలు కూడా ఈ మూవీలో ఉంటాయి. కళాత్మకంగా హృదయానికి హత్తుకునేలా ఈ మూవీ ఉంటుంది.

8ఏఎం మెట్రో చిత్రాన్ని కిశోర్ గంజితో కలిసి దర్శకుడు రాజ్‍ రాచకొండ నిర్మించారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ మెట్రోలోనే సాగింది. ఈ సినిమాను సుమారు రూ.4కోట్ల బడ్జెట్‍తో రూపొందించారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించగా.. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో గుల్షన్, సాయామీతో పాటు కాల్పనికా గణేశ్, ఉమేశ్ కామత్, నిమిషా నాయర్, ధీర్ చరణ్ శీవాత్సవ్, జే ఝా, మధు స్వామినాథ్ కీలకపాత్రలు చేశారు.

8ఏఎం మెట్రో సినిమా స్టోరీ లైన్

మహారాష్ట్ర నుంచి గృహిణి ఐరావతి (సాయామీ ఖేర్) హైదరాబాద్‍కు వస్తుంది. చిన్నతనంలో తనకు ఎదురైన భయానక ఘటన వల్ల ఆమె తరచూ ప్యానిక్ అటాక్‍లకు గురవుతుంటారు. అందుకే రైలులో ఎక్కువగా ప్రయాణించరు. అయితే, తన సోదరి ప్రసవం కోసం ఐరావతి.. తన భర్త లేకుండానే ఒంటరిగా హైదరాబాద్ వస్తారు. ప్రతీ రోజూ మెట్రోలో వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో ప్యానిక్ అవుతుంటారు. అప్పుడే ఓ బ్యాంకులో ఉద్యోగిగా చేసే ప్రీతమ్ (గుల్షన్ దేవయా)తో ఐరావతికి పరిచయం అవుతుంది. ప్రతీ రోజు వారు అదే ట్రైన్‍లో కలిసి ప్రయాణిస్తారు. వారి మధ్య స్నేహం పెరుగుతుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీలో ప్రధాన అంశంగా ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం