తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Custody Ott Release Date: కస్టడీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ముందుగానే వచ్చేస్తోంది

Custody OTT Release Date: కస్టడీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ముందుగానే వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu

07 June 2023, 12:46 IST

    • Custody OTT Release Date: కస్టడీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఊహించిన దాని కంటే ముందుగానే వచ్చేస్తోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానుంది.
కస్టడీ మూవీ
కస్టడీ మూవీ

కస్టడీ మూవీ

Custody OTT Release Date: భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన నాగ చైతన్య కస్టడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. వచ్చే శుక్రవారం (జూన్ 9) ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమాలో కృతి శెట్టి ఫిమేల్ లీడ్ గా కనిపించింది.

ట్రెండింగ్ వార్తలు

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన సినిమా.. సీక్వెల్ కోసం వెయిటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Smile Review: ఆ నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

జూన్ 9న స్ట్రీమింగ్ కానున్న విషయాన్ని బుధవారం (జూన్ 7) అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెల్లడించింది. నిజానికి జూన్ 16న ఈ మూవీ ఓటీటీలోకి రావచ్చని భావించినా.. వారం ముందుగానే వచ్చేస్తోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ.. కన్నడ, మలయాళం భాషల్లోనూ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ మూవీలో ప్రియమణి, అరవింద్ స్వామి కూడా నటించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా క‌స్ట‌డీని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు. సాధార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చాలా వ‌ర‌కు హీరో, విల‌న్ పోరాటం నేప‌థ్యంలో సాగుతుంటాయి.

కానీ క‌స్ట‌డీ మాత్రం విల‌న్‌ను కాపాడ‌ట‌మే హీరో ల‌క్ష్యంగా ఓ డ్రామా సెట్ చేస్తూ దాని చుట్టూ క‌థ‌ను అల్లుకున్నారు ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు. ముఖ్య‌మంత్రి, పోలీస్ క‌మీష‌న‌ర్‌తో పాటు రౌడీల‌ను ఎదురిస్తూ ఓ సాధార‌ణ కానిస్టేబుల్ సాగించే జ‌ర్నీకి యాక్ష‌న్‌, భారీ ఛేజింగ్స్ జోడిస్తూ థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను న‌డిపించారు.

ఇలాంటి క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్ని టైట్ స్క్రీన్‌ప్లేతో రేసీగా న‌డ‌ప‌డం చాలా ముఖ్యం. కానీ ఆ స్పీడ్‌నెస్ ఈ సినిమాలో లోపించింది. సినిమా మొద‌లైన ముప్పై నిమిషాల్లోనే క‌థేమిటి, క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది ద‌ర్శ‌కుడు హింట్ ఇచ్చేశాడు. ట్విస్ట్‌లు పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.