Naga Chaitanya on Divorce: సమంతతో పెళ్లి విషయంలో నన్ను చాలా బాధ పెట్టింది అదొక్కటే: నాగ చైతన్య-naga chaitanya on divorce says that on thing hurt him most ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Chaitanya On Divorce Says That On Thing Hurt Him Most

Naga Chaitanya on Divorce: సమంతతో పెళ్లి విషయంలో నన్ను చాలా బాధ పెట్టింది అదొక్కటే: నాగ చైతన్య

Hari Prasad S HT Telugu
May 09, 2023 03:42 PM IST

Naga Chaitanya on Divorce: సమంతతో పెళ్లి విషయంలో నన్ను చాలా బాధ పెట్టింది అదొక్కటే అని అన్నాడు నాగ చైతన్య. తన జీవితంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన ఘటన ఇదే అని చెప్పాడు.

సమంత, నాగ చైతన్య
సమంత, నాగ చైతన్య

Naga Chaitanya on Divorce: సమంతతో పెళ్లి, విడాకులపై విషయంపై మరోసారి స్పందించాడు నాగ చైతన్య. సమంతతో విడాకులు అత్యంత దురదృష్టకరమని చైతూ అన్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చైతన్య పెళ్లి, విడాకులపై మాట్లాడాడు. అయితే తన జీవితంలోని ఆ దశకు మాత్రం తాను ఎంతో గౌరవం ఇస్తామని స్పష్టం చేశాడు.

"నా వ్యక్తిగత జీవితంలో పెళ్లి విషయంలో జరిగినది చాలా దురదృష్టకరం. కానీ నా జీవితంలోని ఆ దశకు కూడా నేనెంతో గౌరవం ఇస్తాను. ఈ విషయంలో మీడియా రిపోర్టులు, వాళ్ల పుకార్లు, వాటిని వ్యాప్తి చేసిన తీరు వల్ల అభిమానుల దృష్టిలో ఆ గౌరవం పోయింది. ఇదే నన్ను చాలా బాధ పెట్టే విషయం" అని జర్నలిస్టు ప్రేమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య అన్నాడు.

ఇక ఇప్పుడు శోభితా దూళిపాళ్లతో తన డేటింగ్ రూమర్లపై కూడా చైతూ స్పందించాడు. అయితే ఆమె పేరు ఎత్తకుండా అతడు ఈ కామెంట్స్ చేశాడు. ఇవి కూడా కేవలం వాళ్ల హెడ్‌లైన్స్ కోసం క్రియేట్ చేసిన రూమర్లే అని అతడు స్పష్టం చేశాడు. గతంలో జరిగిందంతా మరచిపోవాలని కూడా ఈ సందర్భంగా చైతన్య కోరాడు.

"కేవలం హెడ్‌లైన్స్ కోసం నన్న మరో వ్యక్తితో ముడిపెట్టి రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇది నన్ను చాలా బాధ పెడుతోంది. ఆ మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇందులోకి లాగుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. గతాన్ని మరచిపోవాలి" అని చైతన్య అన్నాడు. సమంత, తాను అధికారికంగా విడాకులతో విడిపోయినట్లు ఈ మధ్యే చైతూ చెప్పాడు.

2010లో తొలిసారి ఏ మాయ చేసావే సినిమాతో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎన్నో ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న చై, సామ్.. 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే వీళ్ల పెళ్లి పెటాకులైంది. 2021, అక్టోబర్ లో తాము విడిపోతున్నట్లు చెప్పారు. ఆ సమయంలో చాలా మంది అక్కినేని అభిమానులు.. సమంతనే నిందించారు. ప్రస్తుతం చైతన్య తన నెక్ట్స్ మూవీ కస్టడీ రిలీజ్ కోసం వేచి చూస్తున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం