Aha Web Series: ఆహా ఓటీటీలోకి అర్ధ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్ వెబ్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-ardhamaindha arun kumar telugu web series where and when to watch this fun series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ardhamaindha Arun Kumar Telugu Web Series Where And When To Watch This Fun Series

Aha Web Series: ఆహా ఓటీటీలోకి అర్ధ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్ వెబ్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 11:31 AM IST

Aha Web Series: ఆహా ఓటీటీలో మ‌రో కొత్త తెలుగు వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది. కార్పొరేట్ వ‌ర‌ల్డ్ క‌ల్చ‌ర్‌ను ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను బుధ‌వారం రిలీజ్ చేశారు. ఈ సిరీస్ టైటిల్ ఏదంటే...

హ‌ర్షిత్‌రెడ్డి
హ‌ర్షిత్‌రెడ్డి

Aha Web Series: ఆహా ఓటీటీలో ద్వారా మ‌రో కొత్త వెబ్‌సిరీస్ త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ వెబ్‌సిరీస్ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను బుధ‌వారం రివీల్ చేశారు. ఈ సిరీస్‌కు అర్ధ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్ అనేటైటిల్‌ను ఖ‌రారు చేశారు. కార్పొరేట్ వ‌ర‌ల్డ్ క‌ల్చ‌ర్‌లోని స‌మ‌స్య‌ల్ని ఆవిష్క‌రిస్తూ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ వెబ్‌సిరీస్ ను తెర‌కెక్కించారు.

అమ‌లాపురానికి చెందిన అరుణ్‌కుమార్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు.అక్క‌డి భాష‌, రాజ‌కీయాల‌తో పాటు తోటి ఉద్యోగుల ఈస‌డింపుల‌ను భ‌రించ‌లేక అరుణ్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడ‌న్న‌ది ఈ సిరీస్‌లో వినోదంతో సందేశాత్మ‌కంగా చూపించ‌బోతున్నారు.

ఇందులో అరుణ్ కుమార్ పాత్ర‌లో హ‌ర్షిత్‌రెడ్డి న‌టిస్తోన్నాడు. అత‌డి ఫ‌స్ట్‌లుక్‌ను బ‌ధ‌వారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గొలుసుల‌తో బంధించ‌బ‌డిన‌ట్లుగా హ‌ర్షిత్ రెడ్డి క‌నిపిస్తోన్నాడు. అత‌డి ముందు ఓ కంప్యూట‌ర్‌, గాలిలో ఎగురుతోన్న‌ పేప‌ర్స్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

హ‌ర్షిత్ రెడ్డితో పాటు అన‌న్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌దివాడ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. గ‌తంలో హ‌ర్షిత్ రెడ్డి మెయిల్ సినిమాతో పాటు త‌ర‌గ‌తి గ‌ది, లూజ‌ర్ అనే వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించాడు. అర్థ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్‌ అత‌డు న‌టిస్తోన్న మూడో తెలుగు వెబ్‌సిరీస్ కావ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు జోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

IPL_Entry_Point

టాపిక్