Custody 1st week collections: భారీ నష్టాలు దిశగా కస్టడీ.. తొలి వారం ముగిసే సరికి సగం కూడా..!-custody movie failed to recover at least 50 percent of break even in 1st week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Custody 1st Week Collections: భారీ నష్టాలు దిశగా కస్టడీ.. తొలి వారం ముగిసే సరికి సగం కూడా..!

Custody 1st week collections: భారీ నష్టాలు దిశగా కస్టడీ.. తొలి వారం ముగిసే సరికి సగం కూడా..!

Maragani Govardhan HT Telugu
May 19, 2023 03:23 PM IST

Custody 1st week collections: నాగచైతన్య నటించిన కస్టడీ మూవీ తొలి వారం మూగిసే సమయానికి భారీగా నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. తొలి వారానికి బ్రేక్ ఈవెన్‌లో సగం కూడా రాబట్టలేకపోయినట్లు సమాచారం.

కస్టడీ మొదటి వారం వసూళ్లు
కస్టడీ మొదటి వారం వసూళ్లు

Custody 1st week collections: టాలీవుడ్ స్టార్ నాగచైతన్య నటించిన కస్టడీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మే 12న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో అడకపోవడంతో అక్కినేని అభిమానులు సైతం నిరాశ చెందారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద నష్టాలను చవి చూసిందని టాక్. మొదటి వారం పూర్తయ్యే సరికి బ్రేక్ ఈవెన్‌లో సగం కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయిందట. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.6 కోట్ల షేర్ మాత్రం వసూలు చేసిందని అంచనా.

కస్టడీ చిత్రం ఆంధ్ర, నైజాం, సీడెడ్ ఈ మూడు ఏరియాల్లో కలిపి బ్రేక్ ఈవెన్‌లో కనీసం 50 శాతం కూడా అందుకోలేకపోయిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొదటి వారం పూర్తయ్యే సరికి సగం రాబట్టినా పెట్టిన ఖర్చులో చాలా వరకు రికవరీ అయ్యే అవకాశముండేది. కానీ ఇప్పుడు క్లిష్టతరంగా మారిందట. విడుదలైన మొదటి రోజు నుంచి సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో అది వసూళ్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. రెండో రోజుకు మౌత్ టాక్ ద్వారా సినిమాకు వసూళ్లు మెరుగవుతాయని మేకర్స్ భావించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు.

ఫలితంగా ఎలాంటి మిరాకిల్ జరగకుండానే కస్టడీ ఆక్యూపెన్సీ తగ్గి వసూళ్లపై ప్రభావం పడింది. దీంతో సినిమా ఫలితంపై అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు మేకర్స్ కూడా నిరాశ చెందుతున్నారు. తెలుగు, తమిళంలో రెండు ప్రదేశాల్లోనూ ఈ సినిమాపై మిక్స్ టాక్ వచ్చింది. అంతేకాకుండా బడ్జెట్ ఎక్కువ కావడం, భారీ తారగణాన్ని ఇందులో తీసుకోవడం లాంటి కారణాల వల్ల మూవీపై ప్రతికూల ప్రభావం పడింది. తొలి వారానికే బయ్యర్లు, ఎగ్జిబీటర్లు నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం