తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Custody Vs Agent: ఏజెంట్ కంటే ముందుగానే ఓటీటీలోకి నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ - స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ ఏదంటే

Custody vs Agent: ఏజెంట్ కంటే ముందుగానే ఓటీటీలోకి నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ - స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ ఏదంటే

HT Telugu Desk HT Telugu

05 June 2023, 10:54 IST

  • Custody vs Agent: అఖిల్ ఏజెంట్ కంటే ముందుగానే నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే....

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య

నాగ‌చైత‌న్య

Custody vs Agent: నాగ‌చైత‌న్య(Naga Chaitanya) క‌స్ట‌డీ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అఖిల్ ఏజెంట్ త‌ర్వాతే థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అఖిల్ (Akhil Akkineni) మూవీకంటే ముందుగానే స్ట్రీమింగ్‌ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన క‌స్ట‌డీ సినిమాకు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ట్రెండింగ్ వార్తలు

Hansika Guardian Review: గార్డియన్ రివ్యూ - హ‌న్సిక లేటెస్ట్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

భారీ అంచ‌నాల‌తో మే 12న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. కాగా ఈ సినిమా జూన్ 9 లేదా 16 తేదీల‌లో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లుతెలిసింది. ఈ రెండు డేట్‌ల‌లో ఏద‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

క‌స్ట‌డీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. దాదాపు ఎనిమిది కోట్ల‌కు తెలుగుతో పాటు త‌మిళ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. రెండు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది.

కానిస్టేబుల్ శివ‌...

ఈ సినిమాలో శివ అనే పోలీస్ కానిస్టేబుల్‌గా నాగ‌చైత‌న్య క‌నిపించాడు. ముఖ్య‌మంత్రి అండ‌తో ఎన్నో నేరాల‌కు పాల్ప‌డిన రాజు అనే క్రిమిన‌ల్‌ను కోర్టులో హాజ‌రుప‌రిచే బాధ్య‌త‌ను చేప‌ట్టిన ఓ కానిస్టేబుల్‌కు ఎదురైన సంఘ‌ట‌న‌ల‌తో యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు వెంక‌ట్ ప్ర‌భు.

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా ఎంగేజింగ్‌గా చెప్ప‌డంలో త‌డ‌బ‌డ‌టంతో క‌స్ట‌డీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. అర‌వింద్ స్వామి, ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమాతోనే కోలీవుడ్‌లో పాగా వేయాల‌న్న నాగ‌చైత‌న్య ఆశ‌లు తీర‌లేదు.

దాదాపు ఇర‌వై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ప‌ది కోట్లు కూడా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది. నిర్మాత‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.