Agent Streaming on Sonyliv: ఓటీటీలోనూ అఖిల్‌కు షాక్ - ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ పోస్ట్‌పోన్‌?-akhil agent ott release date postponed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Akhil Agent Ott Release Date Postponed

Agent Streaming on Sonyliv: ఓటీటీలోనూ అఖిల్‌కు షాక్ - ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ పోస్ట్‌పోన్‌?

HT Telugu Desk HT Telugu
May 19, 2023 07:14 AM IST

Agent Streaming on Sonyliv: అఖిల్ ఏజెంట్ ను ఓటీటీలో చూడాల‌ని ఎదురుచూసిన అక్కినేని అభిమానుల‌ను నిరాశే మిగిలింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయిన‌ట్లు స‌మాచారం.

అఖిల్
అఖిల్

Agent Streaming on Sonyliv: అఖిల్ ఏజెంట్ మూవీ మే 19న సోనిలివ్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా అఫీషియ‌ల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శుక్ర‌వారం సోనిలివ్‌లో ఈ మూవీ రిలీజ్ కాలేదు. దాంతో అక్కినేని ఫ్యాన్స్‌డిజ‌పాయింట్ అయ్యారు.

థియేట‌ర్ రిలీజ్‌కు ఓటీటీ విడుద‌ల‌కు ఇర‌వై రోజులు కూడా గ్యాప్ లేక‌పోవ‌డంతో ఈ సినిమాను మ‌రో వారం పాటు పోస్ట్‌పోన్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను సోనిలివ్ 11 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఏజెంట్‌ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

భారీ అంచ‌నాల‌తో ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవ‌లం ఆరు కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇందులో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించ‌గా సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మించారు.

ఏజెంట్ క‌థేమిటంటే

చిన్న‌త‌నం నుంచి రీసెర్చ్ అనాల‌సిస్ వింగ్ (రా)లో ఏజెంట్‌గా చేరాల‌ని క‌ల‌ల క‌నే రామ‌కృష్ణ అలియాస్ రిక్కీ (అఖిల్ అక్కినేని)అనే యువ‌కుడి క‌థ ఇది. రా ఛీఫ్ మ‌హ‌దేవ్ (మ‌మ్ముట్టి) స‌హాయంతో స్పెష‌ల్ ఏజెంట్‌గా మారిన రామ‌కృష్ణ... ధ‌ర్మ (డినో మోరియో) అనే దేశ‌ద్రోహి కుట్ర‌ల‌ను ఎలా అడ్డుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. రొటీన్ కాన్సెప్ట్ కార‌ణంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

IPL_Entry_Point

టాపిక్