తెలుగు న్యూస్  /  Entertainment  /  Agent Ott Release To Be Completely A New Copy With Deleted Scenes

Agent OTT Release: ఓటీటీలో సరికొత్త ఏజెంట్.. డిలీటెడ్ సీన్లు, పూర్తిగా ఎడిట్ చేసిన కాపీ

Hari Prasad S HT Telugu

31 May 2023, 21:11 IST

    • Agent OTT Release: ఓటీటీలో సరికొత్త ఏజెంట్ రాబోతోంది. డిలీటెడ్ సీన్లు, పూర్తిగా ఎడిట్ చేసిన కాపీని డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అఖిల్ ఏజెంట్ మూవీ
అఖిల్ ఏజెంట్ మూవీ

అఖిల్ ఏజెంట్ మూవీ

Agent OTT Release: ఏజెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం సరికొత్త ఏజెంట్ చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ మూవీని ప్రేక్షకులు తిరస్కరించారు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మేకర్స్ కు భారీ నష్టాలను మిగిల్చింది.

ట్రెండింగ్ వార్తలు

Aamir Khan: ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేశా: ఆమిర్ ఖాన్

DeAr OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన డియర్ సినిమా.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

ఇప్పుడు కనీసం ఓటీటీలో అయినా కాస్త ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్త ఎడిటింగ్ కాపీని తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రీఎడిట్ చేసి, కొన్ని డిలీటెడ్ సీన్లు యాడ్ చేయాలని డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర చెప్పాడట. దీనివల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో అయినా ఓ కొత్త ఫీల్ ను ప్రేక్షకులకు అందించవచ్చని మేకర్స్ అనుకుంటున్నారు.

రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాపయింది. దీంతో ఈ మూవీని నిర్మించిన వారికి భారీ నష్టాలు తప్పలేదు. సరైన స్క్రిప్ట్ లేకుండా సినిమా తీసి పెద్ద తప్పే చేశామని ప్రొడ్యూసరే చెప్పడం గమనార్హం. అఖిల్ అక్కినేని తన మేకోవర్ కోసం ఎంతో శ్రమించినా, రెండేళ్లపాటు మూవీకి కేటాయించినా ఫలితం లేకపోయింది.

ఏజెంట్ మూవీ ఫ్లాప్ తో అందరూ అఖిల్ పై సానుభూతి చూపించారు. సినిమా ఫ్లాప్ అవడం ఒకెత్తయితే తర్వాత ఓటీటీ రిలీజ్ లోనూ క్లారిటీ లేకుండా పోయింది. నిజానికి మే 19నే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే అది కాస్తా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 23న రావచ్చని అంటున్నారు. అయితే దానిపైనా మేకర్స్ నుంచి స్పష్టత లేదు.

ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి థియేటర్లలో బోల్తా పడిన ఏజెంట్.. ఓటీటీలో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందా? మేకర్స్ తీసుకొచ్చే సరికొత్త ఎడిటెడ్ వెర్షన్ ఎలా ఉండబోతోందన్నది వేచి చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.