Bichagadu 2 OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న బిచ్చ‌గాడు -2 - స్ట్రీమింగ్ డేట్ ఇదే-vijay antony bichagadu 2 to stream on disney plus hotstar from june 23 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Antony Bichagadu 2 To Stream On Disney Plus Hotstar From June 23

Bichagadu 2 OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న బిచ్చ‌గాడు -2 - స్ట్రీమింగ్ డేట్ ఇదే

HT Telugu Desk HT Telugu
May 31, 2023 02:48 PM IST

Bichagadu 2 OTT Release Date: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన బిచ్చ‌గాడు 2 మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ది. ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే...

విజ‌య్ ఆంటోనీ
విజ‌య్ ఆంటోనీ

Bichagadu 2 OTT Release Date: విజ‌య్ ఆంటోనీ (Vijay Antony) బిచ్చ‌గాడు -2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. జూన్‌ నెల లాస్ట్‌వీక్‌లో ఈ సీక్వెల్ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. బిచ్చ‌గాడుకు సీక్వెల్‌గా విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన బిచ్చ‌గాడు -2 క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. తెలుగులో ప‌దిహేను కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్స్ మిగిల్చింది.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఈ సినిమా 45 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. ఈ వ‌సూళ్ల‌లో అధిక‌భాగం తెలుగు స్టేట్స్ నుంచే రావ‌డం గ‌మ‌నార్హం. కాగా బిచ్చ‌గాడు 2 డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) రిలీజ్‌కు ముందే సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా జూన్ 23 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌లో అదే రోజు రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

బిచ్చ‌గాడు 2లో కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే విజ‌య్ ఆంటోనీ ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నాడు.

బిచ్చ‌గాడు -2 క‌థ ఇదే…

విజ‌య్ గురుమూర్తి (విజ‌య్ ఆంటోనీ) దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌డిగా చెలామ‌ణి అవుతోంటాడు. అత‌డి ఆస్తిపై క‌న్నేసిన శ‌త్రువులు బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ద్వారా స‌త్య (విజ‌య్ ఆంటోనీ) అనే బిచ్చ‌గాడి మెద‌డును విజ‌య్ గురుమూర్తి బ్రెయిన్‌లో అమ‌రుస్తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?

బిచ్చ‌గాళ్ల కోసం విజ‌య్ గురుమూర్తి ప్ర‌వేశ‌పెట్టిన యాంటీ బికిలీ ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ఎందుకు అడ్డుకోవాల‌ని చూసింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. తొలి సినిమాతోనే బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అనే డిఫ‌రెంట్ పాయింట్‌ను ఎంచుకొని సినిమా చేసి ద‌ర్శ‌కుడిగా ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు విజ‌య్ ఆంటోనీ.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.