Telugu Web Series in Disney+Hotstar: డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నతెలుగు వెబ్‌సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి-dead pixels to save the tigers upcoming telugu web series to stream on disney plus hot star ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Web Series In Disney+hotstar: డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నతెలుగు వెబ్‌సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

Telugu Web Series in Disney+Hotstar: డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నతెలుగు వెబ్‌సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

Telugu Web Series in Disney+Hotstar: డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీ ద్వారా త్వ‌ర‌లోనే మూడు తెలుగు వెబ్‌సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాయి. ఆ సిరీస్‌లు ఏవంటే

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ తెలుగు వెబ్‌సిరీస్‌లు

Telugu Web Series in Disney+Hotstar: ప్ర‌స్తుతం తెలుగులో వెబ్‌సిరీస్‌ల‌కు ఆద‌ర‌ణ పెరిగింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన తెలుగు వెబ్‌సిరీస్‌లు ప్ర‌తివారం ప్రేక్ష‌కుల‌ ముందుకొస్తోన్నాయి. త్వ‌ర‌లోనే మూడు తెలుగు వెబ్‌సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీ సిద్ధ‌మైంది. ఆ సిరీస్‌లు ఏవంటే

డెడ్ పిక్సెల్స్‌

నిహారిక కొణిదెల‌(Niharika Konidela), హ‌ర్ష చెముడు, సాయిరోన‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న డెడ్‌పిక్సెల్స్ వెబ్‌సిరీస్ త్వ‌ర‌లోనే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓ వీడియో గేమ్ కార‌ణంగా ఓ యువ స్నేహ‌బృందానికి ఎదురైన అనూహ్య ప‌రిణామాల‌తో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. హాలీవుడ్‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకొన్న‌ డెడ్‌పిక్సెల్స్ సిరీస్ ఆధారంగా అదే పేరుతో ఈ తెలుగు సిరీస్‌ను తెర‌కెక్కించారు

సేవ్ ది టైగ‌ర్స్‌...

ఇటీవ‌ల బ‌ల‌గం సినిమాతో పెద్ద స‌క్సెస్‌ను అందుకున్న ప్రియ‌ద‌ర్శి (Priyadarshi) త్వ‌ర‌లోనే సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌తో టాలీవుడ్ ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వినోదాత్మ‌క క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో ప్రియ‌ద‌ర్శితో పాటు కృష్ణ‌చైత‌న్య‌, అభిన‌వ్ గోమ‌టం కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తోన్నారు. ఏప్రిల్‌లో ఈ సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

సైతాన్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ బిందుమాధ‌వి (Bindu Madhavi) సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాల కంటే ఎక్కువ‌గా వెబ్‌సిరీస్‌ల‌లోనే న‌టిస్తోంది. ఇటీవ‌లే యాంగ‌ర్ టేల్స్ సిరీస్‌లో న‌టించిన ఆమె త్వ‌ర‌లోనే మ‌రో వెబ్ సిరీస్‌తో స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న‌ది.

సైతాన్ అనే టైటిల్‌తో రానున్న ఈ సిరీస్‌లో బిందుమాధ‌వితో పాటు సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన‌ పాత్ర చేస్తోంది. హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కు మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో మే ఫ‌స్ట్‌వీక్‌లో ఈ సిరీస్ రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.