Simhadri Re Release: సింహాద్రి రీ రిలీజ్ క‌లెక్ష‌న్స్‌ను మంచి ప‌ని కోసం ఉప‌యోగించ‌బోతున్నారు - అదేమిటంటే-ntr simhadri re release collections will used for noble cause ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Simhadri Re Release Collections Will Used For Noble Cause

Simhadri Re Release: సింహాద్రి రీ రిలీజ్ క‌లెక్ష‌న్స్‌ను మంచి ప‌ని కోసం ఉప‌యోగించ‌బోతున్నారు - అదేమిటంటే

HT Telugu Desk HT Telugu
May 17, 2023 11:53 AM IST

Simhadri Re Release: ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సింహాద్రి సినిమా మే 20న రీ రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీ రిలీజ్ ద్వారా వ‌చ్చిన లాభాల‌ను ఓ మంచి ప‌ని కోసం ఉప‌యోగించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఎన్టీఆర్ సింహాద్రి
ఎన్టీఆర్ సింహాద్రి

Simhadri Re Release: ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ రూపంలో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్ష‌న్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఓవ‌ర్‌సీస్‌లోనే 150కిపైగా థియేట‌ర్స్‌లో సింహాద్రి సినిమా విడుద‌ల‌కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు వంద‌ల‌కుపైగా థియేట‌ర్ల‌లో ఈ సినిమా స్పెష‌ల్ షోస్ ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా రీ రిలీజ్ ప్ర‌మోష‌న్స్ కోస‌మే దాదాపు నాలుగు కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్లు చెబుతోన్నారు. బుధ‌వారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ముఖ్య అతిథిగా హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

కాగా సింహాద్రి రీ రిలీజ్ ద్వారా వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌ను మంచి ప‌ని కోసం ఉప‌యోగించ‌బోతున్న‌ట్లు తెలిసింది. పేద‌రికంతో బాధ‌ప‌డుతోన్న ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈ క‌లెక్ష‌న్స్ పంచేందుకు ఏర్పాట్లు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. డిస్ట్రిబ్యూట‌ర్స్ సూచించిన అభిమానుల‌కు సాయాన్ని అందించ‌బోనున్న‌ట్లు చెబుతోన్నారు. సింహాద్రి సినిమాకు ఎస్. ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ త‌ర్వాత ఎన్టీఆర్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. 2003లో టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇందులో సింగ‌మ‌లై, సింహాద్రిగా ప‌వ‌ర్‌ఫుల్ యాక్టింగ్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకొన్నాడు ఎన్టీఆర్‌. భూమిక, అంకిత హీరోయిన్లుగా న‌టించారు. సింహాద్రితో పాటు ఎన్టీఆర్ హీరోగా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆది సినిమా కూడా మే 19న రీ రిలీజ్ కానుంది.

IPL_Entry_Point