Bichagadu 3: బిచ్చ‌గాడు -3 వ‌చ్చేస్తోంది - క‌న్ఫామ్‌ చేసిన విజ‌య్ ఆంటోనీ-vijay antony confirms bichagadu 3 third part goes on floors on this year ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Antony Confirms Bichagadu 3 Third Part Goes On Floors On This Year

Bichagadu 3: బిచ్చ‌గాడు -3 వ‌చ్చేస్తోంది - క‌న్ఫామ్‌ చేసిన విజ‌య్ ఆంటోనీ

HT Telugu Desk HT Telugu
May 22, 2023 01:26 PM IST

Bichagadu 3: బిచ్చ‌గాడు సినిమా ఫ్యాన్స్‌కు విజ‌య్ ఆంటోనీ మ‌రో గుడ్‌న్యూస్ వినిపించాడు. బిచ్చ‌గాడు -3ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు సోమ‌వారం అనౌన్స్‌చేశాడు.

విజ‌య్ ఆంటోనీ
విజ‌య్ ఆంటోనీ

Bichagadu 3: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన బిచ్చ‌గాడు -2 బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. త‌మిళంలో కంటే ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రుస్తోంది.

బిచ్చ‌గాడు -2 కు తెలుగులో మూడు రోజుల్లో 11 కోట్ల గ్రాస్‌, ఐదు కోట్ల తొంభై ల‌క్ష‌ల‌కుపైగా షేర్‌ను రాబ‌ట్టింది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్‌కు ఈ సినిమా చేరువైంది. సోమ‌వారం నాటి వ‌సూళ్ల‌తో బిచ్చ‌గాడు -2 లాభాల్లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు త‌మిళ వెర్ష‌న్ మూడు రోజుల్లో కేవ‌లం ఎనిమిదిన్న‌ర కోట్ల గ్రాస్‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. కాగా బిచ్చ‌గాడు, బిచ్చ‌గాడు -2 స‌క్సెస్ కావ‌డంతో ఈ ఫ్రాంచైజ్‌ను కొన‌సాగించాల‌ని విజ‌య్ ఆంటోనీ నిర్ణ‌యించుకున్నారు.

బిచ్చ‌గాడు -3ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు అనౌన్స్‌చేశాడు. బిచ్చ‌గాడు 3 షూటింగ్‌ను 2025లో మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ మూడో పార్ట్‌కు తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు విజ‌య్ ఆంటోనీ అనౌన్స్‌చేశాడు.

బిచ్చ‌గాడు -2 త‌ర‌హాలోనే ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో బిచ్చ‌గాడు -3ని రూపొందించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. బిచ్చ‌గాడు -3 అనౌన్స్‌మెంట్‌తో ఈ సినిమా మూవీ ఫ్యాన్స్‌లో ఆస‌క్తి నెల‌కొంది.

డ్యూయ‌ల్ రోల్‌లో...

బిచ్చ‌గాడు -2లో విజ‌య్ ఆంటోనీ… విజ‌య్ గురుమూర్తి అనే బిజినెస్‌మెన్‌గా, స‌త్య అనే బిచ్చ‌గాడిగా న‌టించాడు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అనే కాన్సెప్ట్‌తో విజ‌య్ ఆంటోనీ స్వ‌యంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఈ సీక్వెల్‌తోనే మెగాఫోన్ ప‌ట్టిన ఆయ‌న తొలి ప్ర‌య‌త్నంలోనే క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకొన్నాడు. ఈ సినిమాకు హీరోగా, డైరెక్ట‌ర్‌గానే కాకుండా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఎడిట‌ర్‌గా విజ‌య్ ఆంటోనీ వ్య‌వ‌హ‌రించాడు.

ఈ బిచ్చ‌గాడు -2 మూవీకి విజ‌య్ ఆంటోనీ స‌తీమ‌ణి ఫాతిమా విజ‌య్ ఆంటోనీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ సినిమాలో కావ్య‌థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌గా దేవ్‌గిల్‌, రాధార‌వి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

IPL_Entry_Point

టాపిక్