Bichagadu 2 Movie Review: బిచ్చ‌గాడు -2 మూవీ రివ్యూ - విజ‌య్ ఆంటోనీ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే-bichagadu 2 movie review vijay antony action thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bichagadu 2 Movie Review: బిచ్చ‌గాడు -2 మూవీ రివ్యూ - విజ‌య్ ఆంటోనీ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే

Bichagadu 2 Movie Review: బిచ్చ‌గాడు -2 మూవీ రివ్యూ - విజ‌య్ ఆంటోనీ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే

HT Telugu Desk HT Telugu
May 19, 2023 01:29 PM IST

Bichagadu 2 Movie Review: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బిచ్చ‌గాడు -2 మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...

విజ‌య్ ఆంటోనీ
విజ‌య్ ఆంటోనీ

Bichagadu 2 Movie Review: విజ‌య్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా న‌టించిన బిచ్చ‌గాడు -2 (Bichagadu 2) మూవీ నేడు థియేట‌ర్ల ద్వారా తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బిచ్చ‌గాడుకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాతోనే విజ‌య్ ఆంటోనీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. కావ్య‌థాప‌ర్ ( Kavya Thapar )హీరోయిన్‌గా న‌టించింది. ఈ సీక్వెల్ ఎలా ఉంది? బిచ్చ‌గాడు -2తో ద‌ర్శ‌కుడిగా, హీరోగా విజ‌య్ ఆంటోనీకి విజ‌య్ ద‌క్కిందా? లేదా? అన్న‌ది చూద్దాం...

బ్రెయిన్ మార్పిడి క‌థ‌...

విజ‌య్ గురుమూర్తి (విజ‌య్ ఆంటోనీ) ల‌క్షల‌ కోట్ల‌కు అధిప‌తి. దేశంలోనే రిచెస్ట్ బిజినెస్‌మెన్స్‌లో ఒక‌రిగా చెలామ‌ణి అవుతోంంటాడు. విజ‌య్ గురుమూర్తి ఆస్తిపై క‌న్నేస్తాడు అత‌డి స్నేహితుడు అర‌వింద్‌(దేవ్‌గిల్‌). స‌త్య (విజ‌య్ ఆంటోనీ) గంజాయి కేసులో ఇర‌వై ఏళ్లు జైలు శిక్ష‌ను అనుభ‌విస్తాడు. చిన్న‌త‌నంలోనే త‌న‌కు దూర‌మైన చెల్ల్లి కోసం అన్వేషిస్తుంటాడు.

విజ‌య్ గురుమూర్తి, స‌త్య ఒకే పోలిక‌ల‌తో ఉంటారు. విజ‌య్ బ్రెయిన్‌లోకి స‌త్య బ్రెయిన్‌ను మార్చేస్తాడు అర‌వింద్‌. స‌త్య స‌హాయంతో విజ‌య్ ఆస్తిని కొట్టేయాల‌ని ప్లాన్ వేస్తాడు కానీ బ్రెయిన్ మార్పిడి త‌ర్వాత అర‌వింద్‌కు ఎదురు తిరిగిన స‌త్య అత‌డిని చంపేస్తాడు. అత‌డు అలా ఎందుకు చేశాడు? బిచ్చ‌గాళ్ల కోసం యాంటీ బికిలీ అనే ప‌థ‌కాన్ని ఎందుకు ప్రారంభించాడు?

స‌త్య‌ మంచి ప‌నికి ముఖ్య‌మంత్రి ఎందుకు అడ్డుచెప్పాడు? విజ‌య్ ప్లేస్‌లోకి స‌త్య వ‌చ్చిన విష‌యాన్ని పోలీసుల‌తో పాటు అత‌డి ప్రియురాలు హేమ (కావ్యా థాప‌ర్‌) క‌నిపెట్టిందా? బ‌్రెయిన్ మార్పిడి కేసులొ స‌త్య దోషిగా జైలుకు వెళ్లాడా? లేదా? స‌త్య చెల్లెలు దొరికిందా? లేదా? అన్న‌దే(Bichagadu 2 Movie Review) ఈ సినిమా క‌థ‌.

పేరుకే సీక్వెల్‌...

2016లో విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన బిచ్చ‌గాడు మూవీ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ మూవీగా నిలిచింది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కావ‌డంతో ఈ సినిమా కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా విజ‌య్ ఆంటోనీ బిచ్చ‌గాడు -2ను తెర‌కెక్కించారు.

పేరుకే సీక్వెల్ గానీ రెండు క‌థ‌ల‌కు పెద్ద‌గా సంబంధం ఉండ‌దు. బిచ్చ‌గాడు సెంటిమెంట్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తే సీక్వెల్ మాత్రం బ్రెయిన్ మార్పిడి అనే ప్ర‌యోగాత్మ‌క పాయింట్‌కు యాక్ష‌న్ అంశాల‌ను జోడించి న‌డిపించారు. చివ‌రి వ‌ర‌కు క‌థ‌ను ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు విజ‌య్ ఆంటోనీ. బ్రెయిన్ మార్పిడి త‌ర్వాత విజ‌య్ ప్లేస్‌లోకి వ‌చ్చిన సత్యం ఏం చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఊహ‌ల‌కు అందకుండా చ‌క్క‌టి మ‌లుపుల‌తో స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు.

ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ మిస్‌...

విజ‌య్ గురుమూర్తి, స‌త్య నేప‌థ్యాలు, బ్రెయిన్ మార్పిడి అంశాల‌తో ఫ‌స్ట్ హాఫ్‌ను ఎంగేజింగ్‌గా న‌డిపించారు. యాంటీ బికిలీ స్కీమ్ మొద‌లుపెట్టి బిచ్చ‌గాళ్ల‌కు స‌త్య స‌హాయం చేయ‌డం, ప్ర‌భుత్వం అత‌డిపై క‌క్ష క‌ట్టే స‌న్నివేశాల‌తో సెకండాఫ్‌ను అల్లుకున్నారు.

ఫ‌స్ట్ హాఫ్‌లో ఉన్న వేగం సెకండాఫ్‌లో మంద‌గించింది. బిచ్చ‌గాళ్ల‌కు స‌త్య స‌హాయం చేసే స‌న్నివేశాలు బోరింగ్‌సాగాయి. సిస్ట‌ర్ సెంటిమెంట్‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ మిస్స‌యింది. థ్రిల్ల‌ర్ క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన ఫీలింగ్ క‌లుగుతుంది. క‌థ‌లో ఎక్కువ లేయ‌ర్స్ ఉండ‌టంతో ద‌ర్శ‌కుడిగా విజ‌య్ ఆంటోనీ కాస్త క‌న్ఫ్యూజ్ అయిన‌ట్లుగా అనిపిస్తుంది.

విజ‌య్ ఆంటోనీ వ‌న్ మెన్ షో…

విజ‌య్ గురుమూర్తి, స‌త్య‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తోకూడిన క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ ఆంటోనీ న‌ట‌న బాగుంది. పాజిటివ్‌, నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. అత‌డి క్యారెక్ట‌ర్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. హీరోగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా ఫ‌స్ట్ సినిమానే మంచి మార్కులు కొట్టేసాడు. అత‌డు అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్ల‌స్స‌యింది. హేమ‌గా కావ్య‌థాప‌ర్ ప‌ర్వాలేద‌నిపించింది. దేవ్‌గిల్‌, రాధార‌వి త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

Bichagadu 2 Movie Review - కంపేర్ చేస్తే క‌ష్ట‌మే...

బిచ్చ‌గాడు తో కంపేర్ చేసి చూస్తే ఈ సీక్వెల్ కాస్త డిస‌పాయింట్ చేస్తుంది. ఫ‌స్ట్ పార్ట్‌లోని సెంటిమెంట్‌, ఎమోష‌న్స్ ఈ సినిమాలో మిస్స‌య్యాయి. పోలిక‌లు లేకుండా చూస్తే మాత్రం మెప్పిస్తుంది.

రేటింగ్‌: 3/5

IPL_Entry_Point