Bichagadu 2 OTT Platform: బిచ్చగాడు -2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే
Bichagadu 2 OTT Platform: విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన బిచ్చగాడు -2 మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. ఈ సీక్వెల్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది.
Bichagadu 2 OTT Platform: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు -2 మూవీ నేడు తెలుగుతో పాటు తమిళ భాషల్లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2016లో రిలీజైన బిచ్చగాడుకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. బిచ్చగాడు తమిళంతో పాటు తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఈ సీక్వెల్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
బిచ్చగాడు -2 మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకొంది. తెలుగుతో పాటు తమిళ హక్కులను భారీ ధరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు. జూన్ మూడో వారంలో బిచ్చగాడు -2 ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బిచ్చగాడు -2లో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. దేవ్‌గిల్, రాధారవి, యోగిబాబు కీలక పాత్రలను పోషించారు. విజయ్ ఆంటోనీకి యాక్సిడెంట్ కావడం, కోర్టు కేసు కారణంగా ఈ సినిమా ఆలస్యంగా రిలీజైంది. మూలై అనే తమిళ సినిమాను కాపీకొట్టి బిచ్చగాడు -2ను విజయ్ ఆంటోనీ తెరకెక్కించాడని, ఈ సీక్వెల్ ను బ్యాన్ చేయాలని ఓ సీనియర్ కోలీవుడ్ ప్రొడ్యూసర్ కోర్టును ఆశ్రయించాడు.
ఈ వివాదం నుంచి విజయ్ ఆంటోనీకి ఇటీవలే ఊరట లభించింది. గత జనవరిలో మలేషియాలో ఈసినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో ప్రమాదం జరగడంతో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బిచ్చగాడు -2 సినిమాను విజయ్ ఆంటోనీ సతీమణి ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించింది.