Movies in Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ వద్ద వార‌సుల పోరు - శుక్ర‌వారం ఐదు తెలుగు సినిమాలు రిలీజ్‌-ahimsa tho nenu student sir list of telugu movies releasing in theatres this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ahimsa Tho Nenu Student Sir List Of Telugu Movies Releasing In Theatres This Week

Movies in Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ వద్ద వార‌సుల పోరు - శుక్ర‌వారం ఐదు తెలుగు సినిమాలు రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
May 29, 2023 12:37 PM IST

Movies in Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద ఐదు తెలుగు సినిమాలు పోటీ ప‌డ‌బోతున్నాయి. ఆ టాలీవుడ్ మూవీస్ ఏవంటే..

అభిరామ్ ద‌గ్గుబాటి అహింస‌
అభిరామ్ ద‌గ్గుబాటి అహింస‌

Movies in Theaters This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌ల వార‌సులు పోటీప‌డ‌బోతున్నారు. వార‌సుల సినిమాల‌తో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాలు కూడా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. ఆ సినిమాలు ఇవే...

అభిరామ్ ద‌గ్గుబాటి అహింస‌ (Ahimsa)

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్‌బాబు ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఈ వార‌మే టాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. సురేష్‌బాబు చిన్న‌కొడుకు, హీరో రానా సోద‌రుడు అభిరామ్ ద‌గ్గుబాటి (Abhiram Daggubati) అహింస సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తోన్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఈ శుక్ర‌వారం రిలీజ్ కానుంది.

అహింస సినిమాలో గీతిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌జ‌త్‌బేడీ, స‌దా కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. సీత త‌ర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంత‌రం తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. అంతే కాకుండా సుదీర్ఘ విరామం త‌ర్వాత తేజ‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్పీ ప‌ట్నాయ‌క్ క‌లిసి చేస్తోన్న మూవీ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. తొలి సినిమాతో అభిరామ్ హిట్ కొడ‌తాడా? లేదా? అన్న‌ది మ‌రో నాలుగు రోజుల్లో తేల‌నుంది.

బెల్లంకొండ గ‌ణేష్‌బాబు నేను స్టూడెంట్ సార్‌

టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేష్‌బాబు త‌న‌యుడు గ‌ణేష్‌బాబు (Ganesh Babu) హీరోగా న‌టిస్తోన్న నేను స్టూడెంట్ సార్ మూవీ జూన్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాఖీ ఉప్ప‌ల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

ఓ హ‌త్య‌నేరంలో చిక్కుకున్న స్టూడెంట్ ఏ విధంగా ఆ క్రైమ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. నేను స్టూడెంట్ సార్ తో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ భాగ్య‌శ్రీ త‌న‌య అవంతిక దాసాని హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. నాంది ప్రొడ్యూస‌ర్ స‌తీష్ వ‌ర్మ ఈ మూవీని నిర్మించారు.

ప‌రేషాన్ (Pareshan)

గ‌త కొంత‌కాలంగా తెలంగాణ నేప‌థ్య క‌థ‌లు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాల్ని అందుకొంటున్నాయి. ఈ ట్రెండ్‌లో రాబోతున్న మ‌రో మూవీ ప‌రేషాన్ కూడా ఈ వార‌మే థియేటర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ది. తీరువీర్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట సినిమాల ఫేమ్ రూప‌క్ రొనాల్డ్ స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

సింగ‌రేణి యువ‌తి జీవ‌న శైలి నేప‌థ్యంలో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా పరేషాన్ మూవీ రూపొందింది. ప‌రేషాన్ సినిమాను హీరో రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేయ‌బోతున్నాడు. త‌మ్ముడి అభిరామ్ అహింస సినిమాకు పోటీగా ప‌రేషాన్ రిలీజ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అజ‌య్ చ‌క్ర‌వ్యూహం

ఈ మూడు సినిమాల‌తో పాటు సీనియ‌ర్ న‌టుడు అజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించిన చ‌క్ర‌వ్యూహం మూవీ జూన్ 2న రిలీజ్ కానుంది. అలాగే ఐక్యూ ది ప‌వ‌ర్ అఫ్ స్టూడెంట్ కూడా ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

IPL_Entry_Point