TS Weather Update: తెలంగాణకు మూడ్రోజుల వర్ష సూచన-good news for telangana rains across the state for three days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather Update: తెలంగాణకు మూడ్రోజుల వర్ష సూచన

TS Weather Update: తెలంగాణకు మూడ్రోజుల వర్ష సూచన

HT Telugu Desk HT Telugu
May 29, 2023 08:34 AM IST

TS Weather Update: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణలో వర్షాలు, ఏపీలో ఎండలు
తెలంగాణలో వర్షాలు, ఏపీలో ఎండలు

TS Weather Update: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రానున్న మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు, హైదరాబాద్‌ సమీప జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదు కావొచ్చని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మంగళవారం నుంచి జూన్‌ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, పలుచోట్ల ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావ రణ శాఖ వివరించింది.

మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్‌, కొత్తాపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అంబర్‌పేట, ఓయూ, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌ తదిరత ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది. ఆదివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు

నేడు పొడి వాతావరణం

రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మంగళవారం నుంచి జూన్‌ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, పలుచోట్ల ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.

IPL_Entry_Point