Agent Movie OTT update: మరోసారి వాయిదా పడిన ఏజెంట్ ఓటీటీ రిలీజ్.. ఈ సారైనా వస్తుందా?
Agent Movie OTT update: అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం ఓటీటీ విడుదల పలుమార్లు వాయిదా పడగా.. ఎట్టకేలకు ఈ మూవీని సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం.
Agent Movie OTT update: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం గత నెల 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని భావించారు. అంతేకాకుండా ఈ సినిమా మే 19న సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ అది కాస్త వాయిదా పడి మే 26న విడుదలవుతుందని మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే చివరకు మే 26 కూడా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు నోచుకోలేదు. తాజాగా ఈ విడుదల కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఏజెంట్ మూవీ జూన్ 23న ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ డిజిటల్ వేదిక సోనీ లివ్‌లో ఈ మూవీ ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. నిర్మాతల ఒప్పందాల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో ఇది ఆలస్యంగా రానుంది.
ఏజెంట్ మూవీ అఖిల్ అక్కినేని కెరీర్‌లో మంచి బ్రేక్ త్రూ ఇస్తుందని అందరూ ఆశించారు. అంతేకాకుండా అఖిల్ ఈ మూవీ కోసం విపరీతంగా బాడీ బిల్డ్ అప్ చేయడమే కాకుండా తన రూపాన్ని కూడా మార్చుకున్నారు. ఆయన కష్టం తెరపై స్పష్టంగా కనిపించినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టులేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నష్టాలను చవిచూసింది. ఇది అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు మేకర్స్‌కు కూడా నిరాశను కలగజేసింది.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందించారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి కీలక పాత్రలో మెరిశారు, ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు మలయాళంలో ఈ సినిమా ఏకకాలంలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.