తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

28 April 2024, 16:57 IST

    • Pokiri Movie Trending: పోకిరి సినిమా సోషల్ మీడియాలో నేడు ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం రిలీజై 18ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల మోత మోగుతోంది. ఆ వివరాలివే..
Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?
Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Pokiri Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ సినిమా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2006లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. మహేశ్‍కు ఎనలేని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. మాస్ హీరో ఇమేజ్‍ను తీసుకొచ్చింది. అప్పట్లో పోకిరి చిత్రం ఇండస్ట్రీ హిట్‍గా నిలిచి.. దుమ్మురేపింది. దర్శకుడు పూరి జగన్నాథ్‍ కెరీర్లోనూ ఈ చిత్రం హైలైట్‍గా నిలిచింది. ఈ సినిమాలో మహేశ్ యాక్టింగ్, డైలాగ్‍ డెలివరీ, స్టోరీ, క్లైమాక్స్ ట్విస్ట్ ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. అంతటి ఘన విజయం సాధించిన పోకిరి చిత్రానికి నేటితో (ఏప్రిల్ 28, 2024) 18ఏళ్లు పూర్తయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Vidya Vasula Aham OTT Release Date: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

Payal Rajput Rakshana: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్

సోషల్ మీడియాలో ట్రెండింగ్

పోకిరి సినిమా 2006 ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపింది. హౌస్‍ ఫుల్ కలెక్షన్లతో అదరగొట్టింది. ఈ చిత్రం టాలీవుడ్‍లో ఒకానొక ఐకానిక్‍గా నిలిచిపోయింది. మహేశ్ బాబు ఈ చిత్రంలో చేసిన పండు క్యారెక్టర్ కల్ట్‌గా నిలిచింది. దర్శకుడు పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచాయి. ఇప్పటికీ ఈ పోకిరి డైలాగ్స్ వినిపిస్తూనే ఉంటాయి.

పోకిరి సినిమాకు 18 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేడు (ఏప్పిల్ 28) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్వీట్‍లతో మహేశ్ ఫ్యాన్స్ మోతెక్కిస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రంలోని హైలైట్‍లను, రికార్డులను గుర్తు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నేడు ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‍ఫామ్‍లో పోకిరి మూవీ చాలా గంటల పాటు ట్రెండింగ్‍లోనే ఉంది.

ఇండస్ట్రీ హిట్‍గా..

పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. టాలీవుడ్‍లో హయ్యెస్ట్ కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ చిత్రం మొత్తంగా సుమారు రూ.70కోట్ల గ్రాస్ (సుమారు రూ.40 కోట్ల షేర్) కలెక్షన్లు దక్కించుకుంది. 2006లోనే రూ.70కోట్లను దక్కించుకొని ఆశ్చర్యపరిచింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. ఈ రికార్డును 2009లో మగధీర బ్రేక్ చేసింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన పోకిరి సినిమా రూ.70కోట్ల వసూలు చేసి దుమ్మురేపింది. ఈ చిత్రం ఏకంగా 200 థియేటర్లలో 100 రోజులను పూర్తి చేసుకుంది.

డైలాగ్‍లు.. క్లైమాక్స్

పోకిరి చిత్రంలో కొన్ని డైలాగ్స్ చాలా హిట్ అయ్యాయి. “ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‍ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు”.. “ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను”.. “బుల్లెట్ దిగిందా లేదా” ఇలా మరిన్ని డైలాగ్స్ కూడా హైలైట్ అయ్యాయి. పూరి జగన్నాథ్ రాసిన ఈ పవర్ ఫుల్ డైలాగ్‍లను.. మహేశ్ చెప్పిన విధానం అదిరిపోయింది. ఇక, గ్యాంగ్‍స్టర్ పండు (మహేశ్ బాబు)నే కృష్ణ మనోహర్ ఐపీఎస్ రివీల్ చేసే ట్విస్ట్ అప్పట్లో ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చింది. ఒకానొక బెస్ట్ క్లైమాక్స్‌గా ఇది నిలిపోయింది.

పోకిరి చిత్రంలో మహేశ్‍ బాబుకు జోడీగా హీరోయిన్‍గా ఇలియానా నటించారు. ప్రకాశ్ రాజ్, నాజర్, ఆశిష్ విద్యార్థి, షాజాజీ షిండే, బ్రహ్మానందం, అలీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‍తో పాటు ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ కామెడీ కూడా బాగా పండింది.

పోకిరి చిత్రానికి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందిరా ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ పతాకాలపై మంజుల ఘట్టమనేని, పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి శ్యాం కే నాయుడు సినిమాటోగ్రఫీ చేయగా.. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం