Pokiri Special Shows Collections: పోకిరి స్పెషల్ షోస్ కలెక్షన్లు ఎన్నో తెలుసా?
Pokiri Special Shows Collections: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు 47వ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం (ఆగస్ట్ 9) అతని సూపర్ హిట్ మూవీ పోరికి స్పెషల్ షోలు వేసిన విషయం తెలిసిందే.
16 ఏళ్ల కిందట రిలీజై టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ పోకిరి. హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబును ఓ మాస్ క్యారెక్టర్‌లో చూపించిన ఈ సినిమాకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మహేష్ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది. దీంతో సూపర్‌స్టార్ 47వ పుట్టిన రోజు అయిన మంగళవారం (ఆగస్ట్ 9) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.
నిజానికి ఇది అనౌన్స్ చేసిన తర్వాత మూవీ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పోకిరి స్పెషల్ షోలు అభిమానులను అలరించాయి. ఏకంగా 175కుపైగా స్పెషల్ షోలతో ఇండియన్ సినిమా రికార్డులను కూడా ఇది తిరగరాసింది. 4కే రెజల్యూషన్‌తో ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.
ఈ స్పెషల్ షోల గ్రాస్ కలెక్షన్లు రూ.1.5 కోట్లు అని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ఈ షోల బాక్సాఫీస్ కలెక్షన్లపై అధికారిక రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉన్నా.. సుమారుగా ఈ స్థాయిలోనే ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాదు ఈ పోకిరి స్పెషల్ షోలు అమెరికాలో 15598 డాలర్లు, ఆస్ట్రేలియాలో 3733 డాలర్లు వసూలు చేసినట్లు ఓ ట్రేడ్ అనలిస్ట్ వెల్లడించారు.
అయితే వీటి ద్వారా వచ్చిన మొత్తం డబ్బును మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నారుల హార్ట్ ఆపరేషన్లకు ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. ఈ చారిటీ విషయాన్ని గతంలోనే వాళ్లు చెప్పారు. భవిష్యత్తులోనూ ఈ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని మహేష్ భార్య నమ్రత కూడా తన ఇన్‌స్టా పోస్ట్‌లో స్పష్టం చేసింది.
సంబంధిత కథనం