Akhil on Agent Rumours: "సురేందర్ రెడ్డితో నాకు గొడవ?.. విని నవ్వొచ్చింది.." అఖిల్ అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు -akhil akkineni clears all rumours on agent movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Akhil Akkineni Clears All Rumours On Agent Movie

Akhil on Agent Rumours: "సురేందర్ రెడ్డితో నాకు గొడవ?.. విని నవ్వొచ్చింది.." అఖిల్ అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Apr 15, 2023 10:13 PM IST

Akhil on Agent Rumours: అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఏజెంట్ టీమ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా మూవీపై వస్తున్న రూమర్లపై స్పందించింది.

ఏజెంట్ టీమ్ ప్రెస్ మీట్
ఏజెంట్ టీమ్ ప్రెస్ మీట్

Akhil on Agent Rumours: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సరికొత్త చిత్రం ఏజెంట్. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెకక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా చేయగా.. మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 28న ఈ మూవీని విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా శనివారం నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అంతేకాకుండా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ కార్యక్రమంలో హీరో అఖిల్ మాట్లాడుతూ.. ఏజెంట్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుందని చెప్పాడు. "ఇది రెండేళ్ల జర్నీ. ఏజెంట్ నన్ను పూర్తి మార్చి వేసిన సినిమా. నన్ను కాస్త ఇబ్బంది పెడతాను పడాల్సిందే అని సురేందర్ రెడ్డి ముందే నాకు చెప్పి ఈ సినిమా తీశారు. నేను కూడా అందుకు అంగీకరించా. ఈ సినిమాలో నా లుక్ విభిన్నంగా ఉందంటే అందుకు ఆయనే కారణం. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మమ్ముట్టి సార్‌తో కలిసి పనిచేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ఆయన వృత్తికి ఇచ్చే విలువ చాలా గొప్పది. నాలో స్ఫూర్తిని నింపారు" అని అఖిల్ అన్నారు.

అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డితో తాను గొడవపడినట్లు వచ్చిన వార్తలపై అఖిల్ స్పందించారు. "సురేందర్ రెడ్డి చెప్పిన ఈ కథకు వెంటనే ఓకే చెప్పాను. ఈ పాత్ర కోసం నన్ను నేను మార్చుకున్నా. నా మొదటి చిత్రం అఖిల్ సోషియో ఫాంటసీ మూవీ. కానీ ఏజెంట్ పూర్తిగా యాక్షన్ మూవీ. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు రోలర్ కోస్టర్ రైడ్ చేసిన అనుభూతి కలుగుతుంది. కెరీర్ ఇప్పటి వరకు ఆలస్యంగా సినిమాలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందలో కోవిడ్ కూడా ఒకటి. షూటింగ్ జరుగుతున్న సమయంలో నా పైనా, సురేందర్ రెడ్డిపైనా చాలా రకాల వార్తలు వచ్చాయి. మేమిద్దరం గొడవపడినట్లు వార్తలు వచ్చాయి. అవి చూసి నవ్వుకునేవాళ్లం." అని అఖిల్ స్పష్టం చేశాడు.

"షూటింగ్‌లో సురేందర్ రెడ్డి నన్ను కాపాడాడని అఖిల్ చెప్పాడు. షూటింగ్ సమయంలో గాలికి సెట్ పై భాగం ఊడి పడిపోయింది. చెక్కతో తయారు చేసిన ఫ్రేమ్ నా తలపై పడి విరిగిపోయింది. అదే సమయంలో నన్ను కాపాడటానికి వచ్చిన సురేందర్ రెడ్డి కాలిపై ఐరన్ ఫ్రేమ్ పడింది. ఆ రోజు నిజంగా ఆయన నా పాలిట హీరోగా మారారు." అని అఖిల్ చెప్పాడు.

ఏజెంట్‌ను ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్‌కు 10 రోజుల ముందు ఈ మూవీ ట్రైలర్‌ను వదలనున్నారు. అంటే ఏప్రిల్ 18న ఏజెంట్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను వదిలారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. అఖిల్ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియన్ చిత్రం.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.