Akhil Agent Pre Release Event: అఖిల్ ఏజెంట్ కు గుమ్మ‌డికాయ కొట్టేది రేపే - ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌, ప్లేస్ ఫిక్స్‌ -akhil agent pre release event date and venue locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Akhil Agent Pre Release Event Date And Venue Locked

Akhil Agent Pre Release Event: అఖిల్ ఏజెంట్ కు గుమ్మ‌డికాయ కొట్టేది రేపే - ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌, ప్లేస్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 14, 2023 12:46 PM IST

Akhil Agent Pre Release Event: అఖిల్ ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌, ప్లేస్‌ను ఫిక్స్ చేశారు. ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎక్క‌డ జ‌రుగ‌నుందంటే...

అఖిల్ ఏజెంట్ మూవీ
అఖిల్ ఏజెంట్ మూవీ

Akhil Agent Pre Release Event: అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. మ‌రో ప‌దిహేను రోజుల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉండ‌గా ప్ర‌జెంట్ హైద‌రాబాద్‌లో అఖిల్‌, ఊర్వ‌శి రౌటేలాపై ఐటెంసాంగ్ షూట్ చేస్తోన్నారు.

శ‌నివారం నాటితో ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మ‌డికాయ కొట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ స్పీడు పెంచుతోన్నారు. ఈ నెల 18న కాకినాడ‌లో ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత ఏప్రిల్ 23న హైద‌రాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏజెంట్ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. మ‌రోవైపు అఖిల్ అక్కినేని కెరీర్‌లో తొలి పాన్ ఇండియ‌న్ మూవీ ఇది. ఏజెంట్ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఏజెంట్ మూవీకి హిప్‌హాప్ త‌మిళ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

IPL_Entry_Point