Akhil Agent - Urvashi Rautela: అఖిల్‌తో క‌లిసి ఐటెంసాంగ్‌లో స్టెప్పులేయ‌నున్న వాల్తేర్ వీర‌య్య బ్యూటీ -urvashi rautela to feature in akhil agent movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Urvashi Rautela To Feature In Akhil Agent Movie

Akhil Agent - Urvashi Rautela: అఖిల్‌తో క‌లిసి ఐటెంసాంగ్‌లో స్టెప్పులేయ‌నున్న వాల్తేర్ వీర‌య్య బ్యూటీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 10, 2023 12:29 PM IST

Akhil Agent - Urvashi Rautela: ఏజెంట్ మూవీలో అఖిల్‌తో క‌లిసి స్పెష‌ల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులేయ‌బోతున్న‌ది. ఆ హీరోయిన్ ఎవ‌రంటే...

ఊర్వ‌శి రౌటేలా
ఊర్వ‌శి రౌటేలా

Akhil Agent - Urvashi Rautela: వాల్తేర్ వీర‌య్య సినిమాలో చిరంజీవితో క‌లిసి స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడింది బాలీవుడ్‌లో బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా. బాస్ పార్టీ సాంగ్‌లో గ్లామ‌ర్ హోయ‌ల‌తో మెప్పించింది. వాల్తేర్ వీర‌య్య‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మ‌రో స్పెష‌ల్ సాంగ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

అఖిల్ ఏజెంట్‌లో ఊర్వ‌శి రౌటేలా ఐటెంసాంగ్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్రత్యేక గీతంలో అఖిల్ జోడీగా ప‌లువురు బాలీవుడ్‌, సౌత్ హీరోయిన్ల పేర్ల‌ను ప‌రిశీలించిన చిత్ర యూనిట్ చివ‌ర‌కు ఊర్వ‌శి రౌటేలా ను ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లోనే ఈ ఐటెంసాంగ్‌ను షూట్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నారు. ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అఖిల్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. రిలీజ్‌కు మ‌రో ప‌ద్దెనిమిది రోజులు స‌మ‌యం ఉండ‌గా ఇప్ప‌టికీ ఈసినిమా షూటింగ్ పూర్తికాక‌పోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోన్న అభిమానుల్లో మాత్రం విడుద‌ల విష‌యంలో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు హిప్‌హాప్ త‌మిళ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

IPL_Entry_Point

టాపిక్