Waltair Veerayya Streaming on Netflix: ఓటీటీలోకి వ‌చ్చేసిన వాల్తేర్ వీర‌య్య - డిజిట‌ల్ రికార్డుల‌పై క‌న్నేసిన చిరు-chiranjeevi raviteja waltair veerayya streaming now on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Raviteja Waltair Veerayya Streaming Now On Netflix

Waltair Veerayya Streaming on Netflix: ఓటీటీలోకి వ‌చ్చేసిన వాల్తేర్ వీర‌య్య - డిజిట‌ల్ రికార్డుల‌పై క‌న్నేసిన చిరు

Nelki Naresh Kumar HT Telugu
Feb 27, 2023 06:40 AM IST

Waltair Veerayya OTT: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన వాల్తేర్ వీర‌య్య ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజైందంటే..

చిరంజీవి
చిరంజీవి

Waltair Veerayya Streaming on Netflix: చిరంజీవి లేటెస్ట్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ వాల్తేర్ వీర‌య్య ఓటీటీలో రిలీజైంది. సోమ‌వారం (నేటి) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇత‌ర సౌత్ లాంగ్వేజెస్‌, హిందీ భాష‌ల్లో వాల్తేర్ వీర‌య్య‌ను రిలీజ్ చేశారు.

షూటింగ్‌లో ఉండ‌గానే అన్ని భాష‌ల‌కు క‌లిపి దాదాపు 20 కోట్ల‌కు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించాడు. ఇందులో వాల్తేర్ వీర‌య్య అనే మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌గా ఏసీపీ విక్ర‌మ్ సాగ‌ర్‌గా ర‌వితేజ న‌టించాడు.

త‌న సోద‌రుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన డ్ర‌గ్ మాఫియా లీడ‌ర్స్‌పై వాల్తేర్ వీర‌య్య ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే పాయింట్‌ను యాక్ష‌న్‌, మాస్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు బాబీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తీరు ప్రేక్ష‌కుల్ని మెప్పించింది.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ ఈ సినిమా నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. 200 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను 130 కోట్ల‌కుపైగా షేర్‌ను సొంతం చేసుకున్న‌ది. నిర్మాత‌ల‌కు దాదాపు 50 కోట్ల వ‌ర‌కు లాభాల్ని మిగిల్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా వాల్తేర్ వీర‌య్య నిలిచింది. ఇందులో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా కేథ‌రిన్ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఊర్వ‌శి రౌటేలా ఐటెంసాంగ్‌లో న‌టించింది

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.