Ravanasura Update: ర‌వితేజ స్పీడు మామూలుగా లేదుగా - రావ‌ణాసుర షూటింగ్ కంప్లీట్‌-raviteja ravanasura shooting wrapped up ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Raviteja Ravanasura Shooting Wrapped Up

Ravanasura Update: ర‌వితేజ స్పీడు మామూలుగా లేదుగా - రావ‌ణాసుర షూటింగ్ కంప్లీట్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 26, 2023 09:21 AM IST

Ravanasura Update: ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న రావ‌ణాసుర ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ర‌వితేజ
ర‌వితేజ

Ravanasura Update: ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య విజ‌యాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో ఈ జోష్‌ను కంటిన్యూ చేయాల‌ని ప్లాన్ చేస్తోన్నాడు. సినిమాల స్పీడు పెంచేసిన ర‌వితేజ తాజాగా రావ‌ణాసుర షూటింగ్‌ను కంప్లీట్ చేసిన‌ట్లు స‌మాచారం.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. గ‌త కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లో ర‌వితేజ‌, మేఘా ఆకాష్‌ల‌పై శేఖ‌ర్ మాస్ట‌ర్ సార‌థ్యంలో ఓ పాట‌ను చిత్రీక‌రించారు.

శ‌నివారం నాటితో పాట షూట్ పూర్త‌యింది. ఈ పాట‌తోనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిన‌ట్లు చెబుతున్నారు. రావ‌ణాసుర స‌నిమాలో ర‌వితేజ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. నెగెటివ్ షేడ్స్‌తో ఆయ‌న క్యారెక్ట‌ర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో ర‌వితేజ స‌ర‌స‌న ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం. క‌థానాయిక‌లుగా ఫ‌రియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ క‌నిపిస్తున్నారు. సుశాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల ర‌వితేజ పాడిన ప్యార్‌లోన పాగ‌ల్ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఏప్రిల్‌7న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

IPL_Entry_Point