Raviteja Praveen Sattaru Movie: నాగార్జున డైరెక్టర్‌తో రీమేక్ సినిమా చేయనున్న రవితేజ
Raviteja Praveen Sattaru Movie: ది ఘోస్ట్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో మాస్ మహరాజా రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
Raviteja Praveen Sattaru Movie: ధమాకా, వాల్తేర్ వీరయ్య సక్సెస్‌లతో రవితేజ జోరుమీదున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రవితేజ తాజాగా మరో తమిళ రీమేక్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తమిళంలో శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్వకత్వంలో రూపొందిన మానాడు సినిమా కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌కు పొలిటికల్ అంశాలను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌లో రవితేజ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. మరో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ రీమేక్‌కు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రవితేజతో ప్రవీణ్ సత్తారు సినిమా చేయడం ఇదే మొదటిసారి.అంతకాకుండా దర్శకుడిగా ఇప్పటివరకు స్ట్రెయిట్ సినిమాలే చేశారు ప్రవీణ్ సత్తారు. తొలిసారి ఆయన రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించబోతుండటం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ది ఘోస్ట్ సినిమా గత ఏడాది దసరాకు రిలీజైంది. నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ది ఘోస్ట్ తర్వాత వరుణ్‌తేజ్‌తో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు.
వరుణ్‌తేజ్ సినిమా తర్వాతే మానాడు రీమేక్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ రీమేక్‌లో పలు మార్పులు చేస్తోన్నట్లు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మానాడు రీమేక్‌ను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ రీమేక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తోన్నాడు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించినట్లు తెలిసింది.