Raviteja Birthday: 2 సినిమాలు 300 కోట్లు - ర‌వితేజ‌ క‌మ్‌బ్యాక్ అదిరిపోయింది-raviteja birthday special dhamaka waltair veerayya back to back hits on raviteja career upcoming movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Raviteja Birthday Special Dhamaka Waltair Veerayya Back To Back Hits On Raviteja Career Upcoming Movies

Raviteja Birthday: 2 సినిమాలు 300 కోట్లు - ర‌వితేజ‌ క‌మ్‌బ్యాక్ అదిరిపోయింది

Nelki Naresh Kumar HT Telugu
Jan 26, 2023 07:16 AM IST

Raviteja Birthday: సుదీర్ఘ విరామం త‌ర్వాత ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య సినిమాల‌తో వ‌రుస విజ‌యాల్ని అందుకున్నారు ర‌వితేజ‌. ఈ స‌క్సెస్‌ల‌తో ర‌వితేజ త‌దుప‌రి సినిమాల‌పై ట్రేడ్ వ‌ర్గాల్లో బ‌జ్ ఏర్ప‌డింది.

ర‌వితేజ‌
ర‌వితేజ‌

Raviteja Birthday: ధ‌మాకా (Dhamaka), వాల్తేర్ వీర‌య్య బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో మాస్ మ‌హారాజా ర‌వితేజ అద‌ర‌గొట్టాడు. ధ‌మాకా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌గా వాల్తేర్ వీర‌య్య ఇటీవ‌లే 200 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ రెండు విజ‌యాల‌తో మ‌ళ్లీ ర‌వితేజ‌ పూర్వ వైభ‌వాన్ని సొంతం చేసుకున్నాడు.

అర‌డ‌జ‌న్ ఫ్లాప్‌లు...

ధ‌మాకా ర‌వితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ధ‌మాకా సినిమాకు ముందు ర‌వితేజకు స‌రైన స‌క్సెస్ లేదు. క్రాక్ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ప‌ర్వాలేద‌నిపించినా నిర్మాత‌ల‌కు పెద్ద‌గా లాభాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. 2017లో రిలీజైన రాజా ది గ్రేట్ త‌ర్వాత ర‌వితేజ మ‌రో స‌క్సెస్ కోసం దాదాపు ఐదేళ్లు ఎదురుచూడాల్సివ‌చ్చింది. ట‌చ్ చేసి చూడు, నేల టికెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోనీ, డిస్కోరాజా, ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ఇలా అర‌డ‌జ‌నుకుపైగా ప‌రాజ‌యాల్ని అందుకున్నారు.

ఈ వ‌రుస ఫెయిల్యూర్‌తో ర‌వితేజ కెరీర్ క్లోజ్ అయిన‌ట్లేనంటూ ప్ర‌చారం జ‌రిగింది. అత‌డి క‌థ‌ల సెలెక్ష‌న్‌, యాక్టింగ్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో హిట్ కొట్ట‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు. కానీ త‌న‌కు అచ్చొచ్చిన మాస్ కామెడీ జోన‌ర్‌లోనే ధ‌మాకా సినిమాతో విజ‌యాన్ని అందుకొని ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాడు ర‌వితేజ‌.

మాస్ క‌థ‌తో...

స‌రైన మాస్ క‌థ ప‌డితే ర‌వితేజ జోరు ఎలా ఉంటుందో ధ‌మాకా నిరూపించింది. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ చూపించిన వేరియేష‌న్‌, కామెడీ టైమింగ్ థియేట‌ర్ల‌లో అభిమానుల‌ను అల‌రించాయి.

ఈ సినిమాకు ముందు ర‌వితేజ న‌టించిన రెండు సినిమాలు ప‌రాజ‌యం పాలు కావ‌డంతో ధ‌మాకా పెద్ద‌గా అంచ‌నాలు లేకుండానే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ట్రేడ్ వ‌ర్గాల ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను త‌ల‌క్రిందులు చేస్తూ ఊహించ‌ని విజ‌యాన్ని అందుకున్న‌ది.

మ‌ల్టీస్టార‌ర్ స‌క్సెస్‌...

ధ‌మాకా స‌క్సెస్‌ను వాల్తేర్ వీర‌య్య‌తో (Waltair Veerayya)కంటిన్యూ చేశాడు ర‌వితేజ‌. చిరంజీవి మ‌రో హీరోగా న‌టించిన ఈ సినిమాలో ఏసీపీ విక్ర‌మ్ సాగ‌ర్ అనే క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ న‌టించాడు. తెలంగాణ యాస‌తో తొలిసారి డైలాగ్స్ చెప్పి అభిమానుల‌ను అల‌రించాడు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరంజీవి, ర‌వితేజ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈసినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది.

ఇటీవ‌లే రెండు వంద‌ల కోట్ల మైలురాయిని ట‌చ్ చేసింది. ఈ సంక్రాంతికి తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ఈ స‌క్సెస్‌తో ర‌వితేజ త‌దుప‌రి సినిమాల‌పై ఫుల్ ట్రేడ్ వ‌ర్గాల్లో ఫుల్ బ‌జ్ ఏర్ప‌డింది.

నాలుగు సినిమాలు...

ప్ర‌స్తుతం రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు ర‌వితేజ‌.వీటితో పాటు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అలాగే మానాడు రీమేక్‌లో ర‌వితేజ న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

IPL_Entry_Point