Chiranjeevi Mother Birthday: జ‌న్మ జ‌న్మ‌లు నీకు బిడ్డ‌లుగా పుట్టాలి - చిరంజీవి ఎమోష‌న‌ల్ ట్వీట్‌-chiranjeevi shares emotional post on his mother birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Mother Birthday: జ‌న్మ జ‌న్మ‌లు నీకు బిడ్డ‌లుగా పుట్టాలి - చిరంజీవి ఎమోష‌న‌ల్ ట్వీట్‌

Chiranjeevi Mother Birthday: జ‌న్మ జ‌న్మ‌లు నీకు బిడ్డ‌లుగా పుట్టాలి - చిరంజీవి ఎమోష‌న‌ల్ ట్వీట్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 29, 2023 05:51 PM IST

Chiranjeevi Mother Birthday: త‌న త‌ల్లి అంజ‌నాదేవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా ఆమెకు ఎమోష‌న‌ల్‌గా శుభాకాంక్ష‌లు అంద‌జేశారు చిరంజీవి. త‌ల్లి పుట్టిన‌రోజు వేడుక‌ల తాలూకు ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబు
చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబు

Chiranjeevi Mother Birthday: త‌న మాతృమూర్తి అంజ‌నాదేవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు ట్విట్ట‌ర్ వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు మెగాస్టార్ చిరంజీవి. త‌ల్లి పుట్టిన‌రోజు వేడుక‌ల్లో సోద‌రులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్, నాగ‌బాబుతో క‌లిసి తాను దిగిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌చేశారు. ఈ పుట్టిన‌రోజు వేడుక‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌తో పాటు చిరంజీవి సిస్ట‌ర్స్ పాల్గొన్నారు.

చిరంజీవి పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మాకు జ‌న్మ‌ను, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన‌రోజు. జ‌న్మ‌జ‌న్మ‌లు నీకు బిడ్డ‌లుగా పుట్టాల‌ని కోరుకుంటూ హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మ అంటూ ట్విట్ట‌ర్ ద్వారా త‌ల్లి అంజ‌నాదేవికి చిరంజీవి శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ప్ర‌స్తుతం వాల్తేర్ వీర‌య్య స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి.

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించిన ఈ సినిమాలో శృతిహాస‌న్‌, కేథ‌రిన్ క‌థానాయిక‌లుగా క‌నిపించారు.

ప్ర‌స్తుతం చిరంజీవి భోళాశంక‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. త‌మిళ సినిమా వేధాళం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు మోహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.