Chiranjeevi Felicitates RRR Team: చిరంజీవి అయినా పట్టించుకున్నారు.. ఆస్కార్ టీమ్‌కు సన్మానం-chiranjeevi felicitates rrr team at his home during ram charan birthday celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Felicitates Rrr Team At His Home During Ram Charan Birthday Celebrations

Chiranjeevi Felicitates RRR Team: చిరంజీవి అయినా పట్టించుకున్నారు.. ఆస్కార్ టీమ్‌కు సన్మానం

Hari Prasad S HT Telugu
Mar 28, 2023 03:42 PM IST

Chiranjeevi Felicitates RRR Team: చిరంజీవి అయినా పట్టించుకున్నాడు. ఆస్కార్ టీమ్‌కు సన్మానం చేశాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ చాలా రోజుల కిందటే ఆస్కార్ గెలిచి వచ్చినా.. ఇప్పటికీ ఎవరూ వాళ్లను సన్మానించలేదు.

రాజమౌళి దంపతులను సన్మానిస్తున్న చిరంజీవి కుటుంబం
రాజమౌళి దంపతులను సన్మానిస్తున్న చిరంజీవి కుటుంబం

Chiranjeevi Felicitates RRR Team: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలిచిన తొలి ఇండియన్ మూవీ. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అకాడెమీ అవార్డు గెలుచుకుంది. ఎప్పుడో మార్చి 12న ఈ అవార్డుల సెర్మనీ జరగగా.. తర్వాత కొన్ని రోజులకు ఆ మూవీ టీమ్ హైదరాబాద్ వచ్చింది. వాళ్లకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.

అయితే అంతటి ప్రతిష్టాత్మక అవార్డు గెలిచినందుకు ఈ టీమ్ కొన్ని రోజుల పాటు సన్మాన, సత్కారాల్లో బిజీగా ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, సినీ పెద్దలు కానీ ఇప్పటి వరకూ అలాంటిదేమీ చేయలేదు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ టీమ్ ను సత్కరించాడు. తన కొడుకు, ఈ మూవీ హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల కోసం వచ్చిన ఈ మూవీ టీమ్ ను సన్మానించాడు.

సోమవారం (మార్చి 27) చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ చిరంజీవి ఇంట్లో జరిగాయి. ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. అందులో ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఉంది. వాళ్లందరికీ చిరంజీవి శాలువాలు కప్పి సన్మానించాడు. ఆస్కార్ గెలిచినందుకు అభినందించాడు. డైరెక్టర్ రాజమౌళితోపాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, శ్రీవల్లి, రమా రాజమౌళి, కార్తికేయ, కాలభైరవ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యలను చిరు సత్కరించాడు.

ఈ విషయాన్ని చిరు తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. "సన్నిహితుల మధ్య ఆస్కార్ విజేతలను సన్మానించాను. రామ్ చరణ్ బర్త్ డేనాడు ఇది నిజమైన సెలబ్రేషన్. ఇండియన్ సినిమాకు తెలుగు వాళ్లు సాధించిన ఈ ఘనత చరిత్రలో నిలిచిపోతుంది" అంటూ చిరు సన్మానానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు.

ఆస్కార్ గెలిచి దేశమంతా గర్వించేలా చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి చిరంజీవి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ అవార్డు గెలిచిన సమయంలోనూ చిరు స్పందించాడు. ఈ మూవీకి ఆస్కార్ రావడం వెనుక సమష్టి కృషి ఉందని, దీనిని రామ్ చరణ్ ఒక్కడికే కట్టబెట్టొద్దని అప్పట్లో చిరంజీవి అన్నాడు. ఈ ఆర్ఆర్ఆర్ టీమ్ ను త్వరలోనే పార్లమెంట్ లో సత్కరిస్తామని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొన్ని రోజుల కిందట వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం