RRR Oscar Campaign Expense: ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చుపై కార్తికేయ స్పష్టత.. రూమర్లకు చెక్-ss karthikeya clarifies on rrr oscars campaign expenses rumors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Oscar Campaign Expense: ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చుపై కార్తికేయ స్పష్టత.. రూమర్లకు చెక్

RRR Oscar Campaign Expense: ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చుపై కార్తికేయ స్పష్టత.. రూమర్లకు చెక్

Maragani Govardhan HT Telugu
Mar 26, 2023 06:53 PM IST

RRR Oscar Campaign Expense: ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ ప్రచారం కోసం భారీగా ఖర్చుపెట్టిందంటూ వస్తున్న రూమర్లపై ఆ చిత్ర లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ స్పష్టతనిచ్చారు. ఇందుకోసం అయిన ఖర్చెంతో తెలియజేశారు. అంతేకాకుండా ఆస్కార్ కొనుక్కోవచ్చనడం పెద్ద జోక్ అని స్పష్టం చేశారు.

: ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చుపై కార్తికేయ స్పష్టత
: ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చుపై కార్తికేయ స్పష్టత

RRR Oscar Campaign Expense: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మనదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఫలితంగా ఆస్కార్ నామినేషన్‌ను అందుకోవడమే పెద్ద విషయం అనుకుంటే.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డు కూడా దక్కించుకుంది. ఇది కాకుండా గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ లాంటి పలు పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆస్కార్ క్యాంపెయిన్ కోసం ఆర్ఆర్ఆర్ బృందం భారీగా ఖర్చు పెట్టిందని, దాదాపు 80 కోట్లు వరకు వెచ్చించిందని పలు ఊహాగానాలు నెట్టింట హల్చల్ చేశాయి. తాజాగా వీటన్నింటిపై స్పష్టం ఇచ్చారు ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ. ఆస్కార్ కొనుక్కోవచ్చన్నది పెద్ద జోక్ అని ఒక్క మాటతో తేల్చిపడేశారు.

"ఆస్కార్ క్యాంపెయిన్ కోసం ఆర్ఆర్ఆర్ బృందం డబ్బులు భారీగా ఖర్చు పెట్టామని ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చడంతో ఆస్కార్ కోసం కచ్చితంగా క్యాంపెయిన్ చేయాలనుకున్నాం. పబ్లిసిటీ బడ్జెట్‌కు లోబడే ఖర్చు పెట్టాం. ఎక్కడ ఎంత వెచ్చించామనేది ప్రతీది ప్లాన్ ప్రకారమే చేశాం. డబ్బులు ఇస్తే ఆస్కార్ కొనుక్కోవచ్చనేది పెద్ద జోక్. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇనిస్టిట్యూషన్ అది. అక్కడ ప్రతీది ఓ ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. అభిమానుల ప్రేమను కొనగలమా? మూవీ గురించి స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా. అభిమానులే మాకు బాగా ప్రచారం చేశారు." అని కార్తికేయ తెలిపారు.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్ కోసం మూడు దశల్లో ఖర్చు పెట్టామని కార్తికేయ స్పష్టం చేశారు.

ఆస్కార్ క్యాంపెయిన్ కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు పలు స్టూడియోలను ఆశ్రయిస్తారు. మాకు ఆ ఛాన్స్ లేదు. క్యాంపెయిన్ కోసం అనుకున్న బడ్జెట్ రూ.5 కోట్లు. అది కూడా మాకు ఎక్కువ అనిపించింది. వీలైనంత వరకు ఖర్చు తగ్గిద్దామని ప్రయత్నించాం. దాన్ని మూడు దశల్లో ఖర్చు చేయాలనకున్నాం. మొదటి దశలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టాం. నామినేషన్స్‌కు వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తం క్యాంపెయిన్‌కు ఐదారు కోట్లు అవుతుందనుకున్నాం. కానీ చివరకు రూ.8.5 కోట్లు అయింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లో మరిన్ని స్క్రీనింగ్స్ వేయాల్సి వచ్చింది" అని కార్తికేయ వివరించారు.

ఆస్కార్ వేడుకలో టికెట్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టామనే వార్తలపై కూడా కార్తికేయ స్పందించాడు.

"ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు ఆస్కార్ కమిటీ ఆహ్వానితులు. కీరవాణి బాబాయ్, చంద్రబోస్‌లు నామినేషన్‌లో ఉన్నారు. ఇలా నామినేషన్‌లో ఉన్నవారు, కమిటీ పిలిచిన వాళ్లు కాకుండా మిగిలిన వాళ్లు ఆస్కార్ టికెట్లు కొనుక్కోవాల్సిందే. ఇందుకోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఆస్కార్ కమిటీకి ఈ-మెయిల్ చేయాలి. ఆ టికెట్లలో కూడా వివిధ రకాల క్లాస్‌లు ఉంటాయి. మా ఫ్యామిలీ కోసం కీరవాణి బాబాయ్ ఆస్కార్ వాళ్లకు ఈ-మెయిల్ చేశారు. వాళ్లు అన్నీ సరి చూసుకున్న తర్వాత మెయిల్‌కు రిప్లయి ఇస్తూ లింక్ పంపారు, అలా మేము ఒక్కో టికెట్ 1500 డాలర్లు పెట్టి కొన్నాం. అదీ లోయర్ లెవల్. టాప్‌లో కూర్చొని చూసేందుకు మరో నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు కొన్నాం. ఇదంతా అధికారికంగా జరిగింది" అని కార్తికేయ స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024