Akhil Agent Movie: ఏజెంట్‌కు అండగా ఆర్ఆర్ఆర్ హీరోలు - అఖిల్ సినిమాకు గెస్ట్‌లుగా చరణ్, తారక్?
Akhil Agent Movie: అఖిల్ అక్కినేని ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఏజెంట్ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ఏదంటే...
Akhil Agent Movie: ఏజెంట్ సినిమాతో అఖిల్ అక్కినేని పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఫస్ట్ టైమ్ అడుగుపెట్టబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నాడు. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ట్రెండింగ్ వార్తలు
ఏజెంట్ షూటింగ్ తుదిదశకు చేరుకున్నది. ఓ పాట మాత్రమే బ్యాలెన్స్‌గా మిగిలినట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ సాంగ్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిసింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా ప్రమోషన్స్ చేసేందుకు ప్లాన్స్ రెడీ చేస్తోన్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్(Ntr), రామ్‌చరణ్(Ramcharan) గెస్టులుగా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్‌తో తారక్, చరణ్ ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వారిద్దరు గెస్ట్‌లుగా వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఏజెంట్ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తోన్నారు. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతున్నది. అఖిల్ అక్కినేని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.