Samantha Akhil Akkineni: అఖిల్‌కు స‌మంత బ‌ర్త్‌డే విషెస్ - ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్‌-samantha birthday wishes to akhil akkineni instagram post viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Akhil Akkineni: అఖిల్‌కు స‌మంత బ‌ర్త్‌డే విషెస్ - ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్‌

Samantha Akhil Akkineni: అఖిల్‌కు స‌మంత బ‌ర్త్‌డే విషెస్ - ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 08, 2023 02:26 PM IST

Samantha Akhil Akkineni: అఖిల్ అక్కినేని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శ‌నివారం అత‌డికి సోష‌ల్ మీడియా ద్వారా స‌మంత విషెస్ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత చేసిన ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

స‌మంత
స‌మంత

Samantha Akhil Akkineni: నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటోంది స‌మంత. విడాకుల విష‌యంలో ఇన్‌డైరెక్ట్‌గా అక్కినేని ఫ్యామిలీపై ఆరోప‌ణ‌లు చేస్తోంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌, నాగార్జున మిన‌హా మిగిలిన అక్కినేని ఫ్యామిలీ హీరోల‌తో అనుబంధాన్ని కొన‌సాగిస్తోంది.

శ‌నివారం అఖిల్ అక్కినేని బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత‌డికి శుభాకాంక్ష‌లు అంద‌జేసింది స‌మంత‌. అంతే కాకుండా ఈ పోస్ట్‌లో ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న అఖిల్ ఏజెంట్ మూవీ హిట్ కావాల‌ని కోరుకుంది. ఫైర్ ఎమోజీల‌ను జోడించింది. అఖిల్ ఏజెంట్ పోస్ట‌ర్‌ను జోడిస్తూ స‌మంత చేసిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ‌తంలో అఖిల్ సినిమాలు రిలీజ్‌ల‌తో పాటు సుశాంత్‌, సుమంత్ సినిమాల‌పై స‌మంత ప‌లుమార్లు ట్వీట్స్ చేసింది.

నాగ‌చైత‌న్య‌తో విడాకులు, ఆ త‌ర్వాత‌ మ‌యోసైటిస్ కార‌ణంగా వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా కాలం పాటు అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది స‌మంత‌. ఈ క‌ష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోన్న స‌మంత తిరిగి కెరీర్‌పై దృష్టిసారిస్తోంది. స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న శాకుంత‌లం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మైథ‌లాజిక‌ల్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

శాకుంత‌లంతో పాటు తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమా చేస్తోంది స‌మంత‌. అలాగే బాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్ 2 త‌ర్వాత రాజ్ డీకేల‌తో ఓ వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది స‌మంత‌.

IPL_Entry_Point

టాపిక్