Ram Charan Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జోనర్ రివీల్ చేసిన దిల్‌రాజు - సినిమా కథ ఇదేనా
Ram Charan Game Changer: రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్‌ఛేంజర్ జోనర్ ను ఇటీవల దిల్‌రాజు రివీల్ చేశాడు.
Ram Charan Game Changer: రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ జోనర్‌ను ఇటీవల నిర్మాత దిల్‌రాజు రివీల్ చేశాడు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తోన్నారు. రజనీకాంత్ 2.ఓ సినిమా తర్వాత కొంత విరామం అనంతరం శంకర్ దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది.
సినిమా ప్రారంభమై ఏడాది దాటినా గేమ్ ఛేంజర్ కథ, జోనర్ ఏమిటన్నది ఇప్పటివరకు చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఓ సామాజిక సమస్య నేపథ్యంలో సాగే రివేంజ్ డ్రామాగా గేమ్ ఛేంజర్ సినిమా సాగుతుందని అన్నాడు. శంకర్ సినిమాల తరహాలోనే కమర్షియల్ విలువలతో పాటు అంతర్లీనంగా ఓ సోషల్ మెసేజ్ ఉంటుందని చెప్పాడు. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హంగులు ఈ సినిమాలో తక్కువగానే ఉంటాయని దిల్‌రాజు పేర్కొన్నాడు.
జెంటిల్‌మన్, భారతీయుడు తరహాలో వింటేజ్ శంకర్ సినిమాల్ని పోలి గేమ్ ఛేంజర్ ఉంటుందని అన్నాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నట్లు సమాచారం. అవినీతిపై పోరాడే ఐఏఎస్ ఆఫీసర్‌గా అతడు కనిపించబోతున్నట్లు తెలిసింది.
ఈ సినిమా షూటింగ్ 70 పర్సెంట్ వరకు పూర్తయినట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతోన్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.
తమిళ నటుడు ఎస్‌జే సూర్యతో పాటు శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, సునీల్ కీలక పాత్రల్ని పోషిస్తోన్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు మిగిలిన భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది.