Salman Khan Ram Charan: స‌ల్మాన్ - వెంకీల‌తో రామ్‌చ‌ర‌ణ్ లుంగీ డ్యాన్స్ - కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సాంగ్ రిలీజ్‌-ramcharan special appearance in salman khan kisi ka bhai kisi ki jaan yentamma song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan Ram Charan: స‌ల్మాన్ - వెంకీల‌తో రామ్‌చ‌ర‌ణ్ లుంగీ డ్యాన్స్ - కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సాంగ్ రిలీజ్‌

Salman Khan Ram Charan: స‌ల్మాన్ - వెంకీల‌తో రామ్‌చ‌ర‌ణ్ లుంగీ డ్యాన్స్ - కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సాంగ్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 04, 2023 02:06 PM IST

Salman Khan Ram Charan: స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలోని ఏంట‌మ్మా పాట‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. ఈ పాట‌లో స‌ల్మాన్‌ఖాన్‌, వెంక‌టేష్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ స్టెప్ప‌లు వేసి ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నారు.

రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, వెంకటేష్
రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, వెంకటేష్

Salman Khan Ram Charan: స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలోని ఏంటామ్మా పాట‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. ఈ లుంగీ సాంగ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌, వెంక‌టేష్‌, పూజాహెగ్డేల‌తో క‌లిసి టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు.

హిందీ, తెలుగు లిరిక్స్‌ మిక్స్‌తో డిఫ‌రెంట్‌గా సాగిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెడింగ్‌గా మారింది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట‌లో లుంగీలో స‌ల్మాన్‌ఖాన్, వెంక‌టేష్ వేసిన స్టెప్పులు హైలైట్‌గా ఉన్నాయి. ఈ సాంగ్‌ చివ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ ఇచ్చాడు. స‌ల్మాన్‌ఖాన్‌, వెంక‌టేష్‌తో పాటు పూజాహెగ్డేతో క‌లిసి డ్యాన్స్ చేశాడు. వారితో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ కూడా ఈ పాట‌లో క‌నిపించాడు.

స‌ల్మాన్‌ఖాన్‌తో రామ్‌చ‌ర‌ణ్‌కు చ‌క్క‌టి అనుబంధం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమాలో రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా స‌ల్మాన్‌ఖాన్ గెస్ట్ పాత్ర‌లో న‌టించాడు. స‌ల్మాన్ చేసిన స‌హాయానికి కృత‌జ్ఞ‌త‌గా ఇప్పుడు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన‌ట్లు చెబుతోన్నారు.

తెలుగులో విజ‌య‌వంత‌మైన కాట‌మ‌రాయుడు సినిమా ఆధారంగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె సోద‌రుడిగా వెంక‌టేష్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. క‌థానుగుణంగా వెంక‌టేష్, పూజహెగ్డే పాత్ర‌లు తెలుగు నేటివిటీలోనే క‌నిపిస్తాయ‌ని స‌మాచారం.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన బ‌తుక‌మ్మ పాట పూర్తిగా తెలుగులోనే సాగింది. సోమ‌వారం రిలీజ్ చేసిన ఏంట‌మ్మా పాట కంపోజ్ చేసిన విధానం, అందులోని కొన్ని లిరిక్స్ తెలుగులోనే ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

Whats_app_banner