Balagam OTT Release: బలగం ఓటీటీ రిలీజ్ దిల్‌రాజుపై ట్రోల్స్- చిన్న సినిమాకు అన్యాయం చేశాడంటూ కామెంట్స్
Balagam OTT Release: బలగం సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోండగానే ఓటీటీలోకి రావడం టాలీవుడ్‌లో హాట్‌టాసిక్‌గా మారింది. చిత్ర నిర్మాత దిల్‌రాజును పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తోన్నారు.
Balagam OTT Release: ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన సినిమాగా బలగం నిలిచింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. రిలీజై నాలుగు వారాలు దాటినా రోజుకు రెండు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబడుతూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.
ఈ శుక్రవారం నాటితో నాలుగో వారంలోకి బలగం సినిమా ఎంటరైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగైదు వందలకుపైగా థియేటర్లలో ఈ సినిమా స్క్రీనింగ్ అవుతోంది. ఇదిలా ఉండగానే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ సినిమా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. థియేటర్లలో చక్కటి వసూళ్లతో దూసుకుపోతుండగానే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడంపై సోషల్ మీడియాలో దిల్‌రాజుతో పాటు ఆయన నిర్మాణ సంస్థను దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు నెటిజన్లు.
ఇలా చేస్తే భవిష్యత్తులో థియేటర్లు నడవడం కష్టమే కామెంట్స్ చేస్తోన్నారు. చిన్న సినిమా కావడంతోనే థియేటర్‌లో నడుస్తుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారని, స్టార్ హీరోల సినిమాలకు ఇలాగే చేస్తారా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఓటీటీ సంస్థతో దిల్‌రాజు చేసుకున్న ముందస్తు ఒప్పందం మేరకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఓటీటీ రిలీజ్ హీరోకే తెలియదా?
బలగం ఓటీటీ రిలీజ్‌పై హీరో ప్రియదర్శికి ముందుగా సమాచారం లేనట్లుగానే కనిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వార్తలపై స్పందించిన ప్రియదర్శి ఇప్పట్టో ఈ సినిమా ఓటీటీలోకి రాదని, థియేటర్లలోనే చూడండి అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
చావు నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు వేణు ఈ సినిమాకు తెరకెక్కించారు. కమెడియన్‌గా పలు సినిమాలు చేసిన వేణు ఈ సినిమాతోనే మెగాఫోన్ పట్టాడు. కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇరవై రోజుల్లోనే ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.