Balagam First Week Collection: బ‌ల‌గం ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ - నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్‌-balagam movie first week collection dil raju gets double profit
Telugu News  /  Entertainment  /  Balagam Movie First Week Collection Dil Raju Gets Double Profit
బ‌ల‌గం
బ‌ల‌గం

Balagam First Week Collection: బ‌ల‌గం ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ - నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్‌

10 March 2023, 12:40 ISTNelki Naresh Kumar
10 March 2023, 12:40 IST

Balagam First Week Collection: బ‌ల‌గం సినిమా నిర్మాత‌ల‌కు రెండింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఫ‌స్ట్ వీక్‌లో ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే…

Balagam First Week Collection: ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా విడుద‌లైన బ‌ల‌గం దిల్‌రాజుకు రెండింతల లాభాల్ని తెచ్చిపెట్టింది. మొద‌టి వారంలో ఈ సినిమా ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తొలిరోజు వ‌సూళ్లు పెద్ద‌గా రాక‌పోయిన‌ప్ప‌టికీ మౌత్‌టాక్ బాగుండ‌టంతో రోజురోజు క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌చ్చాయి.

రిలీజ్ రోజు యాభై ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ సినిమా నిన్న (గురువారం) అర‌వై ల‌క్ష‌ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఓవ‌రాల్‌గా కోటిన్న‌ర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బ‌ల‌గం సినిమా ఫ‌స్ట్ వీక్‌లో ఏడు కోట్ల గ్రాస్‌ను, మూడు కోట్ల‌కుపైగా షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ నేప‌థ్య క‌థాంశంతో రూపొందిన సినిమా కావ‌డంతో నైజాం ఏరియాలోనే బ‌ల‌గం సినిమాకు నాలుగున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

బ‌ల‌గం సినిమాతో హాస్య‌న‌టుడు వేణు టిల్లు ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు. ప్రియ‌ద‌ర్శి, కావ్య క‌ళ్యాణ్‌రామ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కొముర‌య్య అనే వృద్ధుడి చావు చుట్టూ అల్లుకున్న క‌థ‌తో మాన‌వ సంబంధాల‌కు పెద్ద‌పీట వేస్తూ ద‌ర్శ‌కుడు వేణు ఈ సినిమాను తెర‌కెక్కించారు.

దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న కూతురు హ‌న్షిత‌, హ‌ర్షిత్‌రెడ్డి బ‌ల‌గం సినిమాను నిర్మించారు. తెలంగాణ జీవ‌న సంస్కృతిని వాస్త‌విక కోణంలో ఆవిష్క‌రించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద సినిమాలేవి బ‌రిలో లేక‌పోవ‌డం బ‌ల‌గం సినిమాకు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.