Tecno New Phone: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సబ్‍స్క్రిప్షన్ ఆఫర్‌-tecno phantom x 5g 2 launched in india check price specifications pre booking offers details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tecno Phantom X 5g 2 Launched In India Check Price Specifications Pre Booking Offers Details

Tecno New Phone: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సబ్‍స్క్రిప్షన్ ఆఫర్‌

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 02, 2023 03:20 PM IST

Tecno Phantom X2 5G price in India: టెక్నో ఫాంటమ్ ఎక్స్2 భారత్‍లో లాంచ్ అయింది. కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‍ప్లే, OIS కెమెరాతో ఈ మొబైల్ వచ్చింది. ప్రీ-బుకింగ్ కూడా మొదలైంది.

Tecno Phantom X2 launched: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ వచ్చేసింది
Tecno Phantom X2 launched: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ వచ్చేసింది

Tecno Phantom X2 5G price launched: టెక్నో ఫాంటమ్ ఎక్స్2 మొబైల్ భారత్‍కు వచ్చేసింది. టెక్నో బ్రాండ్ నుంచి ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో అడుగుపెట్టింది. గత నెల సౌదీ అరేబియాలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు భారత్‍లో లాంచ్ అయింది. కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‍ప్లేను, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉండ్ ప్రైమరీ కెమెరాను టెక్నో ఫాంటమ్ ఎక్స్2 కలిగి ఉంది. ఇప్పటికే ఈ మొబైల్ ప్రీ-బుకింగ్ మొదలైంది. Tecno Phantom X2 5G పూర్తి స్పెసిఫికేషన్లు, ధర సహా పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ స్పెసిఫికేషన్లు

Tecno Phantom X2 5G Specifications: 6.8 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‍ప్లేను టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ వస్తోంది. ఈ డిస్‍ప్లే అంచులు ఫ్లాట్‍గా కాకుండా కర్వ్ అయి ఉంటాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‍ ఉంటుంది. 4nm మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. LPDDR5 ర్యామ్‍తో వస్తోంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ HiOS 12.0 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయింది. డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్ ఉంటుంది.

టోక్నో ఫాంటమ్ ఎక్స్2 వెనుక మూడు కెమెరాల అమరిక ఉంటుంది. OIS సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, మరో 2 మెగాపిక్సెల్‍ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు ఇచ్చింది టెక్నో.

Tecno Phantom X2 5G మొబైల్‍లో 5,160ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ మొబైల్ 210 గ్రాముల బరువు ఉంటుంది. వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్‍ఎఫ్‍సీ, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ ధర, ప్రీ-బుకింగ్ వివరాలు

Tecno Phantom X2 5G Price, Pre-Booking: టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ ఫోన్ ఒకే వేరియంట్‍లో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఈ మొబైల్ ధర రూ.39,999గా ఉంది. మూన్‍లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ మొదలైంది. కొనాలనుకునే వారు ఇప్పుడు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈనెల 9వ తేదీన టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ఓపెన్ సేల్‍కు వస్తుంది.

Tecno Phantom X2 5G: ఆఫర్లు

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 5జీ మొబైల్‍ను ప్రీ-బుక్ చేసుకుంటే 12 నెలల పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్‍స్క్రిప్షన్ లభిస్తుంది. తదుపరి ఫాంటమ్ ఎక్స్3 ఫోన్‍కు ఉచితంగా అప్‍గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది.

WhatsApp channel